For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్ ఇనిస్టాగ్రామ్‌లో కొత్త ఫోటో: బందిపోటు అంటూ భజ్జీ కామెంట్

Harbhajan Singh Gives A New Name To Shikhar Dhawan, Fans Love It

హైదరాబాద్: ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి సెలక్టర్లు ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తప్పించడంతో తనకు లభించిన ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా, శిఖర్‌ ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన ఫొటోను పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలో ధావన్ చాలా రిలాక్స్‌గా కూర్చున్నట్లు కనపడుతున్నాడు. ఒంటిపై నల్లటి శాలువా ధరించి, గడ్డం, గుండుతో ఉన్న ధావన్ చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. ఎవరినో తదేకంగా చూస్తున్నట్లు ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Harbhajan Singh Gives A New Name To Shikhar Dhawan, Fans Love It

ఈ ఫోటోను చూసిన టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్... ధావన్‌కు 'డాకు' అంటూ కొత్త పేరు పెట్టాడు. హిందీలో డాకు అంటే బందిపోటు అని అర్థం. ధావన్ కూడా తాను ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలో అచ్చం బందిపోటులాగే ఉండటంతో ఈ పేరు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తనకు 'డాకు' అని పేరు పెట్టినందుకు గానూ భజ్జీకి ధావన్‌ కూడా ఓ కొత్త పేరు పెట్టాడు. 'జగ్గా జాట్' అంటూ కామెంట్ చేశాడు.‌ ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు పంచే వ్యక్తిగా 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన పంజాబ్‌ యోధుడి పేరే 'జగ్గా జాట్'. ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకరికి ఒకరు పెట్టుకున్న పేర్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Story first published: Sunday, October 14, 2018, 15:05 [IST]
Other articles published on Oct 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+