Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్టోబర్‌ 29నే ప్రియురాలితో హర్భజన్‌ సింగ్ పెళ్లి?

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌. అతని ప్రియురాలు, బాలీవుడ్‌ నటి గీతాబస్రాల పెళ్లి తేదీ దాదాపుగా ఖరారైంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం వారి వివాహం ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో జరగనుంది. ఇప్పటికే వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే.

అయితే అక్టోబర్‌ 29న హర్భజన్, బస్సా పంజాబ్‌లోని జలంధర్‌లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. మొత్తం ఐదురోజులపాటు ఈ వివాహ తంతు జరగనుందని తెలిసింది. నవంబర్‌ 1వ తేదీన ఢిల్లీలో రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

Harbhajan Singh and Geeta Basra to get married in October

ప్రస్తుతం గీత బస్రా లండన్‌లో ఉండగా.. ముంబైలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను డిజైన్‌ చేసి అక్కడికే పంపిస్తున్నట్లు తెలిసింది.

కాగా, హర్భజన్‌కి కూడా అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖరారు చేసినట్లు సమాచారం.

భజ్జీ వివాహ వేడుకకు టీమిండియా ఆటగాళ్లతోపాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+