
సాయం చేసి తన గొప్ప మనసుని:
తాజాగా భజ్జీ తన సహచర ఆటగాడు, స్నేహితుడైన హర్మన్ హ్యారీ శస్త్రచికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందజేసి తన స్నేహం గొప్పతనాన్ని చాటాడు. తన స్నేహితుడు, సహచరుడైన హర్మన్ హ్యార్రీ శస్త్ర చికిత్స నిమిత్తం సాయం చేశాడు. పంజాబ్‌కు చెందిన హర్మన్ హ్యారీ-హర్భజన్ సింగ్ 1990ల్లో ఆ రాష్ట్రం తరఫున అండర్-16 క్రికెట్ కలిసి ఆడారు. ఆ సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడంతో
కొన్నేళ్లకు భజ్జీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం భజ్జీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు హర్మన్ హ్యారీ. అప్పుడు హ్యారీ తన దీనమైన పరిస్థితి గురించి వివరించాడు. ‘తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ, నా వద్ద అంత డబ్బు లేదు' అని భజ్జీతో చెప్పాడు.

డబ్బు గురించి ఆలోచించకు.
‘ఒక్క నిమిషం కూడా డబ్బు గురించి ఆలోచించకు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆస్పత్రిలో చేరి అనుభవం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకో. ఆ మొత్తాన్ని నేను అందజేస్తా' అని హామీ ఇచ్చాడు. వెంటనే హ్యారీ ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు హ్యారీ పూర్తిగా కోలుకున్నాడు. హ్యారీ ఆపరేషన్‌కు అయిన రూ.2.5లక్షలను ముందుగా మాటిచ్చినట్లే భజ్జీ అందజేశాడు.

స్నేహితుడంటే ఏంటో చూపించిన భజ్జీ:
‘స్నేహితుడంటే ఏమిటో భజ్జీ నిరూపించాడు. నా దగ్గర డబ్బులు లేవు. నేను దాచుకున్న డబ్బంతా ఏడాది నుంచి తీసుకుంటున్న చికిత్సకే ఖర్చు అయిపోయింది. హర్భజన్ దేవుడిలా వచ్చి నన్ను చావు నుంచి కాపాడాడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మందుల కోసం ఇప్పుడు కూడా నాకు డబ్బులు కావాలి. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అనుకుంటున్నాను' అని హ్యారీ ఆశాభావం వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications

