For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనిపై ఘాటు వ్యాఖ్యలు: ట్విటర్‌లో జోకులు, ఆత్మరక్షణలో భజ్జీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంతో సెలక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ మొత్తానికి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంతో సెలక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ మొత్తానికి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నాడు. ధోనికి వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అతనికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని అన్నాడు.

నేను కూడా 19 ఏళ్లు క్రికెట్‌ ఆడా. భారత్‌ తరఫున మ్యాచ్‌లు గెలిచా, ఓడిపోయా. ప్రపంచకప్‌లు గెలిచిన రెండు జట్లలో నేను సభ్యుడిని. కానీ కొందరు ఆటగాళ్లనే ప్రత్యేకంగా చూస్తున్నారు. కొందరిని చూడడం లేదు. అలా చూడని ఆటగాళ్లలో నేనొకడిని. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు' అని ధోనీని ఉద్దేశించి భజ్జీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

భజ్జీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగడంతో తన తప్పును సరిచేసుకునే పనిలో పడ్డాడు. ధోని విషయంపై శనివారం ట్విట్టర్‌లో స్పందించాడు. 'దయచేసి మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు. నేను అసలు ఇంటర్యూలో ఏం మాట్లాడానో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి' అంటూ హర్భజన్ తన ట్విట్టర్ ఖాతాలో వీడియోని పోస్టు చేశాడు.

'నేను ధోనికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. అతనికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ధోని ఎంపికను నేను తప్పుపట్టలేదు. నాకు ధోని మంచి మిత్రుడు. దాంతో పాటు అతనొక అత్యుత్తమ ఆటగాడు' అని హర్భజన్ తెలిపాడు.

ధోనితో తనను తాను పోల్చుకున్న హర్భజన్‌ వ్యాఖ్యలపై ట్విటర్‌లో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. 'హర్భజన్‌ సింగ్‌ ఛాంపియన్‌ ధోనీతో పోల్చుకుంటున్నాడు. స్టువర్ట్‌ బిన్నీ తనకు తాను.. ఛాంపియన్‌ విరాట్‌తో పోల్చుకున్నట్లు ఉంది' అని ఓ నెటిజిన్ ట్వీట్ చేసింది.

మరో నెజిటన్ 'భజ్జీ.. నీ పట్ల దేశమంతటా గౌరవం ఉంది.. కానీ అదంతా పోతోంది. మీరు పెరిగి పెద్దయ్యారు. ఇప్పుడు రిటైర్‌ అవ్వాలి' అని సూచించాడు. 'యూ ఫూల్. ఐపీఎల్‌కి అంతర్జాతీయ క్రికెట్‌కు తేడా తెలియదా. ధోని గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు' అని ధీరజ్ కుమార్ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+