For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంగీతం అంటే ఎంతో ఇష్టం: త్వరలో సింగర్‌గా హర్భజన్

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో తనలోకి కొత్త టాలెంట్‌ని అభిమానులకు పరిచయం చేయనున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్‌ అందించిన స్వరాలకు హర్భజన్‌ సింగ్ పాట పాడనున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో తనలోకి కొత్త టాలెంట్‌ని అభిమానులకు పరిచయం చేయనున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్‌ అందించిన స్వరాలకు హర్భజన్‌ సింగ్ పాట పాడనున్నాడు.

ఇటీవల భజ్జీ తన పుట్టిన రోజు నాడు వచ్చిన ఆలోచనను మిథూన్‌తో పంచుకున్నాడు. అంతేకాదు మాటల మధ్యలో అతడితో సంగీతం అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ పాటను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

Harbhajan Singh to debut as singer with composer Mithoon

భజ్జీ తనకు ఎప్పటి నుంచో మంచి స్నేహితుడని, దేశ సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తుల గురించి, సంప్రదాయ కళలు, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని వివరించే విధంగా ఓ సింగిల్ పాట రూపొందిద్దామని భజ్జీ తనతో అన్నట్లు మిథూన్‌ తెలిపాడు.

'గతంలోనూ ఎన్నో ఐడియాలను ఇద్దరం షేరే చేసుకున్నా, ఇది మాత్రమే ఇద్దరికీ బాగా నచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించి పనులు మొదలు పెడతాం. ఈ ఏడాది చివర్లో ఈ పాటను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం' అని మిథూన్‌ తెలిపాడు.

భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరిస్తామని హీందీతో పాటు ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని తెలిపాడు. కాగా హర్భజన్ సింగ్ భారత్ తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా భారత జాతీయ జట్టు తరుపున ఆడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+