తండ్రి అయిన భజ్జీ: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా బాస్రా
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ ఆఫ్ స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ తండ్రి అయ్యాడు. భజ్జీ భార్య గీతా బాస్రా బుధవారం (జులై 27)న లండన్‌లోని ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తల్లి అవతార్ కౌర్ హిందీ న్యూస్ డైలీ ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కొడుకు, కోడలికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశానని ఆమె చెప్పారు. అయితే కూతురు పుట్టిన విషయాన్ని అటు హర్భజన్ సింగ్ కానీ, గీతా బాస్రా కానీ సోషల్ మీడియాలో ఎటువంటి ప్రకటన చేయలేదు.

గీతా బాస్రాతో పాటు భజ్జీ కూడా లండన్‌లో ఉన్నారు. హర్భజన్ సింగ్, గీతా బాస్రాల వివాహం జలంథర్‌లో అక్టోబర్ 29, 2015న జరిగింది. జూన్‌లో బేబి షవర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న కారణంగానే గీతా బాస్రా ప్రెగ్నెన్సీ అనే విషయం తెలియడంతో పాటు భజ్జీ తండ్రి కాబోతున్నాడనే విషయం తెలిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications