కరపత్రాల గొడవ: అలాంటి నీచ వ్యాఖ్యలు చేయడు: గంభీర్‌కు భజ్జీ మద్దతు

హైదరాబాద్: క్రికెటర్ నుంచి పొలిటీషియన్‌గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన గౌతమ్ గంభీర్ 2019 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆతిషీపై అశ్లీల కరపత్రాలను గంభీర్ విడుదల చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గంభీరే స్వయంగా ఆ పత్రాలను పంచారంటూ గురువారం ఆమ్ ఆద్మీ(ఆప్) నేతలు గురువారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు.
గంభీర్‌పై వచ్చిన ఆరోపణలపై హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. "గంభీర్‌పై వచ్చిన ఆరోపణలు విని షాకయ్యాను, అతని గురించి నాకు బాగా తెలుసు, మహిళల పట్ల అతను అలాంటి నీచ వ్యాఖ్యలు చేయడు, అతను ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అన్నది అప్రస్తుతం, కానీ అతను మంచి వ్యక్తి" అని భజ్జీ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications