కోలివుడ్‌లో అరంగేట్రం చేస్తున్న హర్భజన్ సింగ్.. సంతానం సినిమాలో కీలక పాత్ర!!

ముంబై: భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారు. తమిళ స్టార్ కమెడియన్ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న 'డిక్కీలోనా' సినిమాతో హర్భజన్ వెండితెరపై అరంగేట్రం చెయ్యనున్నారు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌లో కార్తీక్ యోగి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో అర్జున్, డైరెక్టర్ శంకర్‌ల కాంబోలో వచ్చిన 'జెంటిల్‌మెన్' సినిమాలో గౌండుమణితో సెంథిల్ 'డిక్కీలోనా' ఆట గురించి చెప్పే సీనే సినిమాగా తెరకెక్కుతోంది.

యాక్టర్‌గా మారుతున్న హర్భజన్:
డిక్కీలోనా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్నట్లు సమాచారం తెలుస్తోంది. డిక్కీలోనా సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మూవీ టీమ్ హర్భజన్ సింగ్‌ను సెలెక్ట్ చేసింది. మొత్తానికి హర్భజన్ సింగ్ యాక్టర్‌గా మారుతున్నారు. గ్రౌండ్‌లో వికెట్లు తీసిన హర్భజన్.. థియేటర్స్‌లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. తాను తమిళ సినిమాతో పరిచయమవుతున్నట్లు హర్భజన్ ట్వీట్ చేశారు. అంతేకాదు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం:
39 ఏళ్ల హర్భజన్ సింగ్ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తమిళ అభిమానులు హర్బజన్‌ను ఆదరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రముఖ క్రికెటర్ సినిమాల్లో నటిస్తుండటంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. హర్భజన్ సింగ్ చివరిసారిగా 2016లో టీమిండియాకు ఆడారు.

విక్రమ్ సినిమాలో ఇర్ఫాన్:
మరో భారత స్టార్ పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ 'చియాన్' విక్రమ్‌తో కలిసి త్వరలో ఓ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో తెలిపాడు. తమిళ యువ డైరెక్టర్ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్ నటించనున్నాడు.

పోలీసు అధికారి పాత్రలో:
టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ కనిపించనున్నాడని సమాచారం తెలుస్తోంది. విక్రమ్ నటించే 58వ సినిమా ఇది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇర్ఫాన్ పఠాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ సెవెన్ స్ర్కీన్ స్టూడియో ట్వీట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications