Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: రవిచంద్రన్ అశ్విన్‌ను బీభత్సంగా వాడుకుంది, గతంలో ఎప్పుడూ అతన్ని ఇలా వాడుకోలేదు

Harbhajan Singh About RR Using Ravi Ashwin As Proper Batsman

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ 2022లో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకున్నందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టును టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను బ్యాటింగ్ పరంగా ఉపయోగించుకోలేకపోయింది. అశ్విన్ ఒక సీజన్‌లో రెండుసార్లు మాత్రమే 100పరుగులకు పైగా స్కోర్ చేశాడు. అతను 150కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. 2009లో ప్రారంభమైన తన ఐపీఎల్ కెరీర్‌లో అశ్విన్ స్ట్రైక్ రేట్ 146.40గా ఉంది.

అశ్విన్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న ఫ్రాంఛైజీ రాజస్థానే

అశ్విన్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న ఫ్రాంఛైజీ రాజస్థానే

రాజస్థాన్ టీంలో అశ్విన్‌ నంబర్ 3స్థానంలో ఆడాడు. అలాగే ఫినిషర్‌గా కూడా ఉపయోగపడ్డాడు. అశ్విన్ మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40పరుగులతో చెలరేగడంతో ఆ మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ క్వాలిఫైయర్ 1కి అర్హత సాధించింది. ఇకపోతే 'రాజస్థాన్ రాయల్స్ జట్టు అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు తప్పకుండా మేలు పొందింది. అశ్విన్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న అత్యుత్తమ ఫ్రాంచైజీ ఇదే' అని హర్భజన్ సింగ్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు.

నమ్మకాన్ని నిలబెట్టేలా అశ్విన్ బ్యాటింగ్

నమ్మకాన్ని నిలబెట్టేలా అశ్విన్ బ్యాటింగ్

'అశ్విన్ బ్యాటింగ్ ప్రతిభను ఇంతకు ముందు ఏ ఫ్రాంచైజీ ఈ స్థాయిలో గుర్తించి ఉపయోగించుకోలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అతనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు దిగేలా ప్రోత్సహించింది. జట్టు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతను తన బ్యాటింగ్ ద్వారా ఒక మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు. అశ్విన్ నిజమైన సామర్థ్యాన్ని ఫ్రాంఛైజీ సరిగ్గా అర్థం చేసుకుంది. ఫ్రాంచైజీ తన మీద పెట్టిన నమ్మకానికి తగ్గట్లు అశ్విన్ కూడా రాణించి క్రెడిట్ పొందాడు' అని భజ్జీ తెలిపాడు.

కోల్ కతాలో బాగా ఫ్రెష్‌గా ఉంటాయి.. కాస్త ఛేంజ్ చేసుకోవాలి

కోల్ కతాలో బాగా ఫ్రెష్‌గా ఉంటాయి.. కాస్త ఛేంజ్ చేసుకోవాలి

రాజస్థాన్ రాయల్స్ తరఫున అశ్విన్ 30కి పైగా సగటుతో 183 పరుగులు చేశాడు, అలాగే బౌలింగ్లో 9కంటే తక్కువ ఎకానమీ రేటుతో 11వికెట్లు తీశాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి భజ్జీ మాట్లాడుతూ.. 'రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ కోల్‌కతాలోని పిచ్‌లకు సర్దుబాటు కావాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని పిచ్‌లలో రెగ్యులర్‌గా మ్యాచ్ లు జరిగాయి కాబట్టి కాస్త స్లో అయ్యాయి. కానీ ఈడెన్ గార్డెన్స్ ట్రాక్ తాజాగా ఉంటాయి.

కాబట్టి బట్లర్ మాత్రమే కాదు, ప్రతి బ్యాటర్ తమ బ్యాటింగ్లో అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.' బట్లర్ విషయానికి వస్తే అతను టోర్నీ ఫస్టాఫ్‌లోనే కుమ్మేశాడు. టోర్నమెంట్ చివర్లో అతని బ్యాట్ ద్వారా పరుగులు అంతగా రాలేదు. అతను తన ఫామ్‌ను తిరిగి పొందడానికి మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని' భజ్జీ సూచించాడు.

Story first published: Tuesday, May 24, 2022, 17:11 [IST]
Other articles published on May 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+