ఆ ముగ్గురు అవకాశాలకు అర్హులు కాదా.. టెల్ మీ? హర్భజన్ సీరియస్ క్వశ్చన్స్

ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లకు ఎందుకు అవకాశాలు రావడం లేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. శ్రీలంకతో ఆసియా కప్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత భజ్జీ ప్రశ్నలు గుప్పించాడు. సూపర్ ఫోర్స్ దశలో భారత్‌కి ఇది వరుసగా రెండో ఓటమి.. మొదట ఆదివారం పాకిస్థాన్‌తో ఓడిన ఇండియా నిన్న శ్రీలంక చేతిలో పరాభవానికి గురయింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 42బంతుల్లో 72పరుగులతో భారత బ్యాటింగ్‌ను నడిపించాడు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 173పరుగుల మంచి స్కోరును నమోదు చేసింది.

బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేలా లంక ఆట
అయితే ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్‌లు గట్టిగా నిలదొక్కుకున్నారు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేలా ఆడారు. దీంతో ఆ జట్టుకు శుభారంభం లభించింది. ఇద్దరూ చెరో యాభై చేయడంతో ఇండియా నుంచి మ్యాచ్‌ను తమ వైపు తిప్పేశారు. అయితే యుజ్వేంద్ర చాహల్ వీరిని ఔట్ చేయడంతో మళ్లీ మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అయినట్లు కన్పించింది. చాహల్ మూడు వికెట్లు తీయడం వల్ల భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ కెప్టెన్ దసున్ షనక, హిట్టర్ భానుక రాజపక్స కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో విజయగీతను దాటించారు. చివరి ఓవర్లో 7పరుగులు అవసరమైన దశలో అర్షదీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ ఓవర్ త్రో వల్ల 5వ బంతికి లక్ష్యాన్ని చేరుకున్నారు. తద్వారా ఆరు వికెట్ల తేడాతో లంక గెలుపొందింది.

గందరగోళంగా జట్టు కూర్పు
ఇక సూపర్ 4 దశలో భారత జట్టు కూర్పు విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్డ్ హిట్టర్ అయిన దినేష్ కార్తీక్‌ను పక్కన పెట్టడం, అలాగే మూడో స్పెషలిస్టు పేస్ ఆప్షన్ లేకుండా బరిలోకి దిగడం, హార్దిక్ పాండ్యానే ఎక్కువగా నమ్ముకోవడం, అలాగే మూడో స్పిన్ ఆప్షన్‌ను జట్టులోకి తీసుకున్నా యుటిలైజ్ చేసుకోకపోవడం, ఇలా చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా బౌలింగ్లో భారత జట్టు లుకలుకలు తేలిపోతున్నాయి. షమీ, బుమ్రా లాంటి సీనియర్లు లేని లోటు కన్పించింది. అలాగే రవీంద్రా జడేజా గాయంతో దూరం కావడం కూడా జట్టును దెబ్బతీసింది. అతని ప్లేసులో అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్‌ను తీసుకోకపోవడం కూడా విమర్శలకు కారణమైంది. ఏదేమైనా జట్టు కూర్పు విషయంలో చాలా లొసుగులు ఉన్నట్లు స్పష్టమైంది.

జట్టు మేనేజ్‌మెంట్‌పై భజ్జీ అసంతృప్తి
శ్రీలంకపై ఓటమి అనంతరం భజ్జీ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జట్టు మేనేజ్‌మెంట్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఎందుకు భాగం కావడం లేదని ప్రశ్నించారు. దినేష్ కార్తీక్‌కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని నిలదీశాడు. '150కి.మీల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌ను ఎక్కడుంచారు? అత్యుత్తమ స్వింగ్ బౌలర్ అయిన దీపక్ చాహర్‌ను ఎందుకు పట్టించుకోరు. ఈ కుర్రాళ్ళు అవకాశాలకు అర్హులు కదా చెప్పండి ? దినేష్ కార్తీక్‌కు ఎందుకు నిలకడగా అవకాశాలు ఇవ్వట్లేదు ?? జట్టు మేనేజ్ మెంట్ నన్ను నిరాశపరిచింది' అని సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. లంక చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్‌కు చేరే అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ ఫైనల్ చేరదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications