For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్నో సార్లు సారీ చెప్పా: మైదానంలో భజ్జీతో గొడవపై రాయుడు (వీడియో)

By Nageshwara Rao
Harbhajan, Rayudu recall on-field fight: I have said sorry so many times

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంలో అంబటి రాయుడిది కీలకపాత్ర. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లాడిన అంబటి రాయుడు 602 పరుగులు నమోదు చేసిన చెన్నై జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ మూడు సార్లు విజేతగా నిలవడంలో కీలకంగా నిలిచిన ఇద్దరు ఆటగాళ్లు హర్భజన్‌ సింగ్‌, అంబటి రాయుడు. ఈ ఇద్దరూ ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఈ సీజన్‌లో చెన్నై టైటిల్ విజేతగా నిలవడంతో అత్యధిక సార్లు(నాలుగు సార్లు) ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సరసన చేరారు.

అయితే, గతంలో ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తరుణంలో గ్రౌండ్‌లో గొడవపడ్డ సంగతి తెలిసిందే. అప్పటి మ్యాచ్‌లో హర్భజన్‌ సింగ్ వేసిన బంతిని రైజింగ్‌ పుణె బ్యాట్స్‌మెన్‌ సౌరభ్‌ తివారీ ఆడగా ఫీల్డింగ్‌ చేస్తున్న రాయుడు బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు.

రాయుడిపై కేకలు వేసిన హర్భజన్ సింగ్

రాయుడిపై కేకలు వేసిన హర్భజన్ సింగ్

దీంతో కోపోద్రిక్తుడైన హర్భజన్ సింగ్ వెంటనే రాయుడిపై గట్టిగా కేకలు వేశాడు. రాయుడు సైతం అదే రీతిలో స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత వెంటనే హర్భజన్‌ సింగ్ వెంటనే రాయుడి భుజంపై చేతులు వేసి సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ రాయుడు చేతులు విదిల్చుకొని భజ్జీకి దూరంగా వెళ్లిపోయాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడే సందర్భంలో హర్భజన్ సింగ్ 'భజ్జీ బ్లాస్ట్' అనే ఛాట్ షోలో అంబటి రాయుడిని ఇంటర్యూ చేశాడు. ఈ ఇంటర్యూలో ఆ మ్యాచ్‌కి సంబంధించి అప్పటి సంగతులు వీరిద్దరూ గుర్తు చేసుకున్నారు. ఇంటర్యూలో వీరిద్దరి సంభాషణలు ఈ విధంగా ఉన్నాయి.

నేనెంతో మందితో పోట్లాడాను

హర్భజన్ సింగ్: నేనెంతో మందితో పోట్లాడాను. అందులో ఒక్కరు మాత్రమే నాకు ఎదురుతిరిగారు. అతడే రాయుడు. మైదానంలో ఇలాంటివి సహజం. అంత వరకు ఫర్వాలేదు. మైదానం బయట మాత్రం అలా ఉండకూడదు. మైదానంలో కాకపోతే ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ. జట్టు అత్యత్తుమ ఫలితం కోసమే కదా ఇదంతా.

అంబటి రాయుడు: అప్పుడు జరిగిన దానికి నేను మళ్లీ క్షమాపణలు తెలియజేస్తున్నా. నేనెన్నో సార్లు క్షమించాలని కోరా.

హర్భజన్ సింగ్: వద్దు.. వద్దు.. క్షమాపణలు వద్దు. నువ్వొక్కడివే కాదు నేనూ చాలా సార్లు సీనియర్లతో గొడవ పడ్డా. ఆ తర్వాత వెళ్లి క్షమాపణలు కోరడంతో సమస్య అక్కడితో పోయేది.

అంబటి రాయుడు: అప్పుడెందుకు అలా ప్రవర్తించానో నాకే తెలియదు.

8 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం

8 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్(117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో మూడో ట్రోఫీని అందుకున్న రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘతన సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు (2013, 2015, 2017)లో మూడు సార్లు ట్రోఫీని అందుకుంది.

రోహిత్ శర్మ సరసన రాయుడు, భజ్జీ

రోహిత్ శర్మ సరసన రాయుడు, భజ్జీ

తద్వారా అత్యధిక ఐపీఎల్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. 2009లో రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ నాలుగు సార్లు ఐపీఎల్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు. అయితే, ఆదివారం జరిగిన పైనల్లో సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించడంతో ఇప్పుడు అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌ కూడా రోహిత్‌ శర్మ సరసన నిలిచారు. రోహిత్ శర్మతో పాటు అత్యధిక ఐపీఎల్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల(నాలుగు సార్లు) జాబితాలో ఈ ఇద్దరు కూడా చేరారు.

Story first published: Tuesday, May 29, 2018, 18:40 [IST]
Other articles published on May 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+