Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్

రోహిత్ శర్మ అనంతరం టీమిండియా టీ20 బాధ్యతలను సంజు శాంసన్‌కు అప్పగించాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. అలాగే రానున్న టీ20 వరల్డ్ కప్‌ భారత జట్టులో వికెట్ కీపర్‌గా శాంసన్ స్థానం ఖరారైపోయిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను శాంసన్ గొప్పగా నడిపిస్తున్న నేపథ్యంలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్-2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టాప్ గేర్‌లో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. జైపుర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన RR ఏడు విజయాలతో టేబుల్ టాప్‌లో కొనసాగుతోంది.

Harbhajan Not Hardik Samson to Lead India Post Rohit

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (63; 45 బంతుల్లో, 5x4, 3x6), నెహాల్ వదేరా (49; 24 బంతుల్లో, 3x4, 4x6) టాప్ స్కోరర్లు. సందీప్ శర్మ అయిదు వికెట్లతో (5/18)తో చెలరేగాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (104*; 60 బంతుల్లో, 9x4, 7x6) అజేయం శతకంతో అదరగొట్టాడు. సంజు శాంసన్ (38*; 28 బంతుల్లో, 2x4, 2x6) ఆకట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో జైస్వాల్, శాంసన్‌ను కొనియాడుతూ భజ్జీ ట్వీట్ చేశాడు.''ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అని జైస్వాల్ తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం గురించి చర్చ అవసరం లేదు. టీ20 వరల్ట్ కప్ భారత జట్టులో శాంసన్ ప్లేస్ ఖరారైనట్లే. అంతేగాక రోహిత్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ శాంసన్ ఎదిగాడు'' అని హర్భజన్ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్య టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కానీ రోహిత్ తర్వాత భారత భవిష్యత్ కెప్టెన్‌గా శాంసన్ పేరును హర్భజన్ కొత్తగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

Story first published: Tuesday, April 23, 2024, 10:15 [IST]
Other articles published on Apr 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+