Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాన్ బెర్రాకు వెళ్లేది లేదు: టీం ఇండియా

Harbhajan Singh

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ సైమండ్స్ పై జాతిపరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణపై మూడు టెస్టుల పాటు నిషేధానికి గురైన స్పిన్నర్ హర్బజన్ సింగ్ కు భారత క్రికెట్ జట్టు సభ్యులు సంఘీభావం ప్రకటించారు. హర్బజన్ పై నిషేధం ఎత్తేసేవరకు సిడ్నీ నుంచి తర్వాతి టెస్టు మ్యాచు జరిగే కాన్ బెర్రాకు కదలకూడదని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం తాము బస చేసిన హోటల్ లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

హర్బజన్ పై నిషేధం ఎత్తేసే వరకు కాన్ బెర్రాకు వెళ్లకూడదని టీం ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సూచించింది. అంపైరింగ్, హర్బజన్ పై నిషేధం వివాదాలను పరిష్కరించే వరకు సిడ్నీ నుంచి కదలకూడదని సూచించింది. హర్బజన్ పై నిషేధం ఏకపక్షమని బిసిసిఐ విమర్శించింది. రెఫరీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తెలియజేసింది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రవర్తన పట్ల, అంపైరింగ్ నిర్ణయాల పట్ల టీం ఇండియా సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Story first published: Monday, January 7, 2008, 14:19 [IST]
Other articles published on Jan 7, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+