అర్షదీప్ సింగ్‌పై జాత్యాహంకర దూషణలు.. అరేయ్ కొంచెమన్న సిగ్గుండాలిరా అంటూ హర్భజన్ సింగ్ ఫైర్

ఆసియాకప్ 2022లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా 5వికెట్ల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ మిస్ చేయడం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అర్షదీప్ సింగ్ క్యాచ్ మిస్ చేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారి పాకిస్థాన్ విజయానికి దరిచేరింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) శుభారంభాన్నిచ్చారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182పరుగులు చేసి విజయాన్నందుకుంది. మహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), అసిఫ్ అలీ(16) కీలక పరుగులు చేశారు.
కొంపముంచిన అర్షదీప్ సింగ్..
చివరి 18బంతుల్లో పాక్ విజయానికి 34పరుగులు చేయాల్సిన తరుణంలో రవి బిష్ణోయ్ బౌలింగ్ అందుకున్నాడు. రెండు వైడ్లు వేసి క్రీజులో ఉన్న ఆసిఫ్ అలీని కాస్త లయ దెబ్బతీసేలా చేశాడు. అయితే 3వ బంతికి ఆసిఫ్ అలీ హిట్టింగ్ చేయాలని చూడగా బంతి గాల్లోకి లేచింది. ఇక గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ సునాయసంగా క్యాచ్ అందుకోవాల్సింది.
అయితే బాల్ చేతుల్లో పడి నేలపాలయింది. అంతే ఒక్కసారిగా గ్రౌండ్లో భారత అభిమానులంత సైలెన్స్ అయిపోయారు. రోహిత్ శర్మకు కోపం కట్టలు తెంచుకుంది.. అర్షదీప్ సింగ్‌పై ఓ రేంజులో అరిచాడు. ఇక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది.
కాలీస్థానీఅంటూ అర్షదీప్ సింగ్‌పై ట్రోల్స్
ఇక అర్షదీప్ సింగ్ సిక్కుమతానికి చెందిన ప్లేయర్ అని తెలుసు. ఇక అతని మతాన్ని ఉద్దేశించి కొందరు పోస్టులు చేశారు. మరికొందరు అతను సిక్ కాదు ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించే కాలీస్థానీ అంటూ దెప్పిపొడిచారు. ఇక కొందరైతే కావాలనే ఈ కాలీస్థానీ ప్లేయర్ క్యాచ్ జారవిడిచాడు.. కావాలనుకుంటే రిప్లేలో చూసుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఎంత ట్యాలెంటెడ్ ప్లేయర్ అయినా ఇలాంటి మ్యాచ్‌ల్లో ఇంత ఇంపార్టెంట్ క్యాచ్ మిస్ చేయడమంటే.. అతని సీరియస్ నెస్ లేని ప్లేయర్ అంటూ విమర్శిస్తున్నారు. ఇంకొందరు అతన్ని హసన్ అలీతో పోల్చుతున్నారు.
ఎవరూ కావాలని క్యాచ్‌లు వదలరు
ఇక అర్షదీప్ సింగ్‌తో సహా భారత టీం మేట్లపై వస్తున్న విమర్శల పట్ల మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా సీరియస్ అయ్యాడు. జాత్యాహంకర దూషణలు చేస్తున్న నెటిజన్లనుద్దేశించి ఇక బాక్వస్ బంద్ చేయండన్నారు. 'మన కుర్రాడు అర్షదీప్ సింగ్‌ను విమర్శించడం మానేయండి. ఎవరూ కావాలని క్యాచ్‌ను వదిలేయరు. ఏదేమైనా మన భారత కుర్రాళ్లను చూసి గర్విస్తున్నాం.. పాకిస్థాన్ మెరుగ్గా ఆడింది. ట్విట్టర్ వేదికపై అర్షదీప్‌పైన టీమ్‌పైన చౌకబారు కామెంట్లు చేస్తున్న వాళ్లకు సిగ్గుండాలి. అర్ష్ బంగారం' అంటూ పేర్కొన్నాడు. ఇకపోతే నెటిజన్లు మాత్రం అర్షదీప్ సింగ్‌ను విపరీతంగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications