న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యోయో ఫైయిలైతే కోహ్లీని తీసేసేవాళ్లా..??

Harbhajan And Azharuddin Express Doubts Over The Yo-Yo Test
Harbhajan, Azharuddin raise serious questions on Yo-Yo test

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లకు ఫిట్‌నెస్ ఉండాలంటూ బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్టు గురించి పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒకవేళ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ యో యో ఫెయిలైతే అతనిని కూడా నుంచి తప్పిస్తారా అని ప్రశ్నిస్తున్నారు మాజీ క్రికెటర్లు అజారుద్దీన్‌, ఆకాశ్‌ చోప్రా. ఐపీఎల్‌లో రాణించి యోయో టెస్టులో విఫలమైన అంబటి, సంజు శాంసన్‌‌లను జట్టు నుంచి తప్పించడం సరికాదన్నారు.

కోహ్లీ కావాలి కాబట్టే..2 వారాల తర్వాత

కోహ్లీ కావాలి కాబట్టే..2 వారాల తర్వాత

యో యో టెస్టు ఫలితం అంటూ వారిని జట్టు నుంచి తొలగించారంటూ ఆకాశ్‌ చోప్రా, అజారుద్దీన్‌, హర్భజన్‌ సింగ్‌‌లు ఎద్దేవా చేస్తున్నారు. ఈ సందర్బంగా స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. ‘ఒకవేళ విరాట్‌ కోహ్లీ ఈ పరీక్ష ఫెయిలైతే.. అతడ్ని జట్టులో నుంచి తొలగిస్తారా?. ఒక టెస్టు పేరుతో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులో నుంచి తీసేయడం సరికాదు. మీరు కోహ్లీని ఆడించాలనుకున్నారు కాబట్టి అతనికి రెండు వారాలు విశ్రాంతి ఇచ్చి యో యో టెస్టు నిర్వహించారు. మిగతా ఆటగాళ్ల పట్ల అలాగే వ్యవహరించాలి 'అని అన్నాడు.

యో యో టెస్టు ఓ కొత్త డ్రామా

యో యో టెస్టు ఓ కొత్త డ్రామా

అనంతరం టీమిండియా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘యో యో టెస్టు ఓ కొత్త డ్రామా. అసలు ఈ పరీక్ష క్రికెటర్లకు అవసరమే లేదు. ఫుట్‌బాల్‌, హాకీ ఆటగాళ్లకు ఇది అవసరం. వారు మైదానం అంతా పరిగెడుతూ ఉండాలి. కాబట్టి పూర్తి ఫిట్‌నెస్‌ ఉండాలి. క్రికెట్‌లో అలా కాదు. ఈ టెస్టు కారణంగా ఫామ్‌లో ఉన్న రాయుడు జట్టులో కోల్పోయాడు. జట్టును ఎంపిక చేసేందుకు యో యో టెస్టు ప్రామాణికంగా ఉండకూడదు. ఆటగాడి ఫామ్‌, ప్రతిభ.. ఈ రెండే ముఖ్యమైనవి' అని భజ్జీ తెలిపాడు.

 భారత కోచ్‌ రవిశాస్త్రి కూడా

భారత కోచ్‌ రవిశాస్త్రి కూడా

యోయో టెస్టుపై వీరు చేసిన వ్యాఖ్యలను అజారుద్దీన్‌ కూడా సమర్థిస్తున్నాడు. ‘గతంలో ఈ పరీక్షలో ఎంతో మంది భారత దిగ్గజ ఆటగాళ్లు ఫెయిలయ్యారు. అందులో ఇప్పటి భారత కోచ్‌ రవిశాస్త్రి కూడా ఉన్నాడు. ఒక్కో ఆటగాడికి ఒక్కో విధంగా ఫిట్‌నెస్‌ లెవల్స్‌ ఉంటాయి. నేను ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాను. కానీ, నా పాదాలను అందుకోమంటే నేను అందుకోలేను. మైదానంలో ఆటగాడి వద్దకు బంతి వచ్చినప్పుడు తన శక్తినంతటినీ సమకూర్చుకుని ఆడతాడు.'

సునీల్ గవాస్కర్‌ కూడా యోయో ఫెయిలై

సునీల్ గవాస్కర్‌ కూడా యోయో ఫెయిలై

'సునీల్ గవాస్కర్‌ కూడా యోయో ఫెయిలైనవాడే. యో యో ఫెయిలైతే జట్టులో చోటు దక్కదన్న విషయాన్ని ఆటగాడికి ముందుగానే చెప్పాలి. జట్టు ఎంపిక చేసిన తర్వాత వారికి టెస్టు నిర్వహించి ఆ తర్వాత ఫెయిలయ్యాడని తప్పించడం సవ్యం కాదు' అని అజార్‌ వివరించాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:58 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X