Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్కార్ పాటకు కాలు కదిపిన మాజీ లెజెండ్స్.. వీడియో వైరల్!

Harbhajan and Suresh Raina dance to Naatu Naatu song

ఆస్కార్ అవార్డు అందుకున్న పాటకు మాజీ దిగ్గజాలు కాలు కదిపారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ)లో ఇండియా మహరాజాస్ తరఫున ఆడుతున్న భారత మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా ఇద్దరూ కలిసి 'నాటు.. నాటు..' పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎల్ఎల్‌సీ అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది.

'నేను చెప్తున్నా కదా.. అవి స్వీట్ ఫీట్' అని ఈ వీడియోకు క్యాప్షన్ జత చేసింది. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో 'నాటు.. నాటు..' పాటకు అవార్డు లభించిన సంగతి తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

భారత దేశంలో కూడా ఆర్ఆర్ఆర్ టీంకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ పాట దేశం మొత్తం మారుమోగుతోంది. కాగా, లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా బుధవారం నాడు ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మహరాజాస్ అనుకున్నంత స్కోరు చెయ్యలేకపోయింది. సురేష్ రైనా (49) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో ఈ జట్టు 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో క్రిస్ గేల్ (56) రాణించడంతో వరల్డ్ జెయింట్స్ ఈ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇది ఇండియన్ మహరాజాస్‌కు ఈ లీగ్‌లో రెండో ఓటమి కావడం గమనార్హం.

Story first published: Thursday, March 16, 2023, 12:17 [IST]
Other articles published on Mar 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+