Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్విట్జర్‌లాండ్‌ నుండి 'విరుష్క' నూతన సంవత్సర శుభాకాంక్షలు (వీడియో)!!

Happy New Year 2020: Virat Kohli wishes fans along with Anushka Sharma


స్విట్జర్‌లాండ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మలు స్విట్జర్‌లాండ్‌లో విహరిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విరుష్క జోడి తమ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. శీతల దేశం స్విట్జర్‌లాండ్‌లోని మంచు కొండల్లో నిల్చుని రూపొందించిన వీడియోలో కోహ్లీ-అనుష్క జంట సందడి చేశారు. వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ... 'అందమైన ప్రదేశం నుంచి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని అన్నాడు.

అనుష్క శర్మ మాట్లాడుతూ... '2019 ప్రతిఒక్కరికి సంతృప్తికరంగా గడిచిందని ఆశిస్తున్నా. 2020 మరింత బాగా ఉండాలని కోరుకుంటున్నా. మీ అందరికీ మా ఇద్దరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని పేర్కొంది. విరుష్క జోడి బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధవన్‌, అతని గర్ల్‌ఫ్రెండ్‌ నటాశా దలాల్‌తో న్యూఇయర్‌ ఎంజాయ్‌ చేశారు. కోహ్లీకి ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్‌లు లేకపోవడంతో దొరికిన ఖాళీ సమయంను తన భార్యతో గడుపుతున్నాడు.

టీమిండియా క్రికెటర్లకు కోచ్ రవిశాస్త్రి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు. '2019లో అద్భుతంగా రాణించారు. అదేవిధంగా 2020లో వచ్చే సరికొత్త సవాళ్లకు సిద్దంగా ఉండాలి. విరామ సమయాన్ని అందరూ ఎంజాయ్‌ చేయండి. 2020లో కలుద్దాద్దాం' అని ట్వీట్‌ చేశాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, నటి రవీనా టాండన్‌, వ్యాపారవేత్త గౌతమ్‌ సింగానియాలతో కలిసి దిగిన ఫోటోను రవిశాస్త్రి షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

వెస్టిండీస్‌ సిరీస్‌ ముగిశాక టీమిండియా క్రికెటర్లకు స్వల్ప విరామం లభించింది. దీంతో ఈ గ్యాప్‌లో క్రికెటర్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎందరూ తమతమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది. ఆపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది.

Story first published: Wednesday, January 1, 2020, 10:01 [IST]
Other articles published on Jan 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+