For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువీ 'స్వీట్ బర్త్ డే' కి ట్వీట్ విషెస్

Happy Birthday, Yuvraj Singh: A look back at his six sixes off Stuart Broad

హైదరాబాద్: 36 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సిక్లర్ల యువరాజ్‌కు సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ కైఫ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, మన్‌దీప్‌ సింగ్‌ తదితరులు యువీకి తమదైన శైలీలో ట్వీట్‌లలో శుభాకాంక్షలు పంపారు. 2007 లో ఒకే ఒక ఓవర్లో వరుసగా ఆరు సిక్స్ లు కొట్టగల యువరాజ్‌కు పుట్టిన రోజుకు శుభాకాంక్షలు.
ఇవిగో...

ఏ బీ సీ డీ ఈ ఎఫ్‌ జీ హెచ్‌ ఐ జే కే ఎల్‌ ఎం ఎన్‌ ఓ పీ క్యూ ఆర్‌ ఎస్‌ టీ డబ్ల్యూ ఎక్స్‌ వై జడ్‌, చాలావాటిల్లో వీటిని చూస్తాం. కానీ యువీ మాత్రం అత్యంత అరుదు. నా ప్రియ మిత్రుడు యువరాజ్‌సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేందుకు నీ పోరాటం కొనసాగాలి.
- వీరేంద్ర సెహ్వాగ్‌

నా జీవిత గమనంలో విడదీయరాని భాగానికి హ్యాపీ బర్త్‌డే. యువీ అన్నింటా నువ్వు అత్యుత్తమంగా ఉండాలని తప్ప మరేదీ కోరుకోను. కొత్త సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలి.
- మహ్మద్‌ కైఫ్‌

మేమెప్పుడూ పోరాడేలా పాఠాలు చెప్పిన యువీకి హ్యాపీ బర్త్‌డే. ఎన్నో వేదికలపై నీ అద్భుతమైన ప్రదర్శనలతో మమ్మల్ని గర్వపడేలా చేశావ్‌. దేవుడు నిన్ను చల్లగా చూడాలి.
- సురేశ్‌ రైనా

హ్యాపీ బర్త్‌డే యువీ. నీ సంకల్ప బలం, పోరాటానికి వెన్నుచూపని ప్రవర్తనతో అందరికీ ప్రేరణగా నిలిచావు. నీకెప్పుడూ దేవుడి ఆశీర్వాదాలు ఉండుగాక.
- వీవీఎస్‌ లక్ష్మణ్‌

నా పెద్ద సోదరుడు యువరాజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- శిఖర్‌ ధావన్‌

యువీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- మహ్మద్‌ షమి

హ్యాపీ బర్త్‌డే యువీ పాజీ. నువ్వు చిరకాలం మమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉండాలి! నీతో కలిసి ఆడినందుకు, నేర్చుకున్నందుకు నేనెంతో లక్కీ. దేవుడు నిన్నెప్పుడూ చల్లగా చూడాలి. - మన్‌దీప్‌ సింగ్‌

యువరాజ్‌సింగ్‌.. హ్యాపీ బర్త్‌డే యంగ్‌ మ్యాన్‌..
- సౌరవ్‌ గంగూలీ
యువీ పా హ్యాపీ బర్త్‌డే. వచ్చే ఏడాదంతా నీకు సంతోషం, విజయం కలగాలి. మళ్లీ కలుస్తా. టేక్‌ కేర్‌.
- జస్ప్రీత్‌ బుమ్రా

హ్యాపీ బర్త్ డే మోట్టూ..

-సానియా మీర్జా

యోయో ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైన యువీ ఆ తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏలో కఠోరంగా శ్రమించి పాసయ్యాడు. ఈ సందర్భంగా 'నేను వైఫల్యాలను చూసి భయపడను. ఎత్తుపల్లాలెన్నో చూశా. ఓటములను చవిచూశా. అవే విజయానికి మూలస్తంభాలు. జీవితంలోనూ విజయవంతం కావాలంటే ఓటములను అనుభవించాల్సిందే. అది మనల్ని మరింత శక్తివంతుల్ని చేస్తుంది. తర్వాతి స్థాయిలో నిలబెడుతుంది. ది' అని చెప్తుంటాడు. యువీ కెరీర్‌లో 40 టెస్టుల్లో 1900పరుగులు, 304 వన్డేల్లో , 8701 పరుగులు, 58 టీ20ల్లో 1177 పరుగులు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 12, 2017, 18:16 [IST]
Other articles published on Dec 12, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+