Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాపీ బర్త్‌డే: స్టార్‌ స్పోర్ట్స్‌‌ సూపర్‌ ‘వి’ సిరిస్‌లో కోహ్లీ భలే ముద్దొస్తున్నాడు! (వీడియో)

 Happy Birthday Virat Kohli: Super V series is Indian captains gift to his little fans

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజుని జరుపుకునేందుకు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్‌ పర్యటనలో ఉన్నాడు.

యాదృచ్ఛికమో ఏమో కానీ తెలియదు గానీ, గతేడాది కూడా కోహ్లీ తన పుట్టినరోజు నాడు భార్య అనుష్కతోనే కలిసి ఉన్నాడు. వరల్డ్ కప్ నుంచి విరామం లేకుండా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతోండటంతో పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

బంగ్లా పర్యటన నుంచి కోహ్లీకి విశ్రాంతి

గతేడాది కూడా కోహ్లీ తన పుట్టినరోజు నాడు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పట్లో వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. వెస్టిండిస్‌తో టీ20 సిరిస్ జరగుతున్న సమయంలోనే కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో గతేడాది విరాట్ కోహ్లీ తన పుట్టినరోజుని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో జరుపుకున్నాడు.

సూపర్‌ ‘వి' పేరిట కొత్త సిరిస్

ఇదిలా ఉంటే, కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ ‘వి' పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను మంగళవారం (మధ్యాహ్నం 3.30) ప్రసారం చేస్తోంది. 15 ఏళ్ల వయస్సులో క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పటినుంచి భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యే వరకు కోహ్లీ ఎదుర్కొన్న కష్టాలతో పాటు సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్‌లో ప్రదర్శించనున్నారు.

యువతకు స్ఫూర్తినిచ్చేలా

దీంతో పాటు చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్‌ కోహ్లీకి ఉన్న సంబంధాలను అద్భుతంగా చూపించనున్నారు. ఈ సూపర్‌ 'వి' సిరిస్‌ను దేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. తొలి ఎపిసోడ్‌ను కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం టెలికాస్ట్‌ చేయనున్నారు.

భూటాన్ పర్యటనలో విరుష్క జోడీ

మిగిలిన పదకొండు ఎపిసోడ్స్‌ను ఆ తర్వాతి ఆదివారాలు ఉదయం 9 గంటల నుంచి స్టార్‌ప్లస్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ, మార్వెల్‌ హెచ్‌క్యూ, హాట్‌ స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. కాగా, కోహ్లీ పుట్టినరోజు పుట్టినరోజు నాడు భూటాన్‌ను పర్యటనకు ఎందుకు వెళ్లామనే విషయాన్ని సైతం అనుష్క శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. స్వ‌చ్ఛ‌మైన మాన‌వ సంబంధాల‌ను మేం ఇష్ట‌ప‌డుతామ‌ని అనుష్క శర్మ వెల్ల‌డించింది.

ట్విట్టర్‌‌లో కోహ్లీ భావోద్వేగ సందేశం

కోహ్లీ తన పుట్టినరోజు నాడు తన ట్విట్టర్‌‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు. చిన్నతనంలో త‌న గురించి తాను రాసుకున్న లేఖ‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నాళ్ల‌ త‌న జ‌ర్నీ, త‌న జీవితంలో ఎదురైన అనుభ‌వాలను ఆ లేఖ‌లో రాశాడు. క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటానని అందులో రాసుకొచ్చాడు.

Story first published: Tuesday, November 5, 2019, 14:05 [IST]
Other articles published on Nov 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+