ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా.. ఐ లవ్ యూ!!

ముంబై: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మర్చి 15న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను అతను ప్రేమించి పెళ్లాడాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవా వేదికగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అయ్యేవరకు పూర్తి వివరాలు గోప్యంగా ఉంచిన బుమ్రా.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఎంత సీక్రెట్ మెయింటేన్ చేశారంటే.. బుమ్రా, సంజన షేర్ చేసేవరకు వారి పెళ్లి ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు వీరికి వివాహం జరుగుతుందనే ఎవరూ ఊహించలేదు.
సంజనాకు లవ్లీ విషెస్:
జస్ప్రీత్ బుమ్రా తన సతీమణి సంజన గణేశన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఒక అందమైన ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు ఓ లవింగ్ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. 'ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా దానివి. ఐ లవ్ యూ' అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. సంజన ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అందరూ సంజనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐపీఎల్ 2021 రద్దు కావడంతో బుమ్రా, సంజన స్పెషల్ పార్టీ ఆరెంజ్ చేశారని సమాచారం.

2016లో భారత జట్టులోకి:
ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా.. 23 జనవరి 2016లో భారత జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం భారత పేస్ విభాగంను తన భుజాలపై మోస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2021 వాయిదా పడినా.. జూన్‌లోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్ ఉంది. బుమ్రా భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా :
మహారాష్ట్రకు చెందిన సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7తో కెరీర్ ఆరంభించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సంజన ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020, 21 సీజన్‌కి కూడా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా సంజనా పనిచేశారు. సంజనాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications