For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Happy Birthday Sunil Gavaskar: టెస్టులకు కేరాఫ్ అడ్రస్.. 10వేల పరుగులతో చరిత్ర!!

Happy Birthday Sunil Gavaskar, Fans wished Former India Captain

హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​గా భారత క్రికెట్​ జట్టుకు అపూర్వ సేవలందించారు. క్రికెట్​ ప్రపంచంలో భారత జట్టు ఖ్యాతిని పెంచేందుకు తన వంతు కృషి చేసిన సన్నీ.. టెస్టులకు కేరాఫ్​గా నిలిచారు. గవాస్కర్ 1949, జులై 10న జన్మించారు. ఈరోజు 72వ పడిలోకి అడుగుపెట్టారు. బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండ్ అవుతోంది. ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్.. ఒకే టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. 18 మంది ప్లేయర్లతో సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన గావస్కర్.. రెండు విభిన్నమైన వేదికల్లో నాలుగు వరుస సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆరంగ్రేటం చేసిన టెస్టు సిరీస్‌లోనే అయన 774 పరుగులు చేశారు. ఇప్పటివరకు మరే క్రికెటర్ ఒకే టెస్టు సిరీస్‌లో 700 పరుగులు చేయలేకపోయారు. టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడు కూడా.

భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.

సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో గొప్ప ఓపెనర్లలో ఒకరుగా నిలిచారు. 1970, 1980లలో భారత బ్యాటింగ్‌లో ప్రధానమైన గవాస్కర్.. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. కరీబియన్ బౌలర్లు సంధించే బంతులకి అప్పట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం బెంబేలెత్తిపోయేవారు. కానీ హెల్మెట్, గాడ్స్‌ లాంటి సేప్టీలు పెద్దగా లేని రోజుల్లోనే సన్నీ ఎంట్రీ మ్యాచ్‌లోనే వెస్టిండీస్ బౌలర్లని ఉతికారేశారు. భారత్‌ క్రికెటర్లకే కాదు.. ప్రపంచానికి టెస్టుల్లో ఎలా ఆడాలో నేర్పించిన మాస్టర్ గవాస్కర్. 1983లో ప్రపంచకప్‌ సాధించిన టీమిండియా జట్టు సభ్యులు కూడా. ప్రస్తుతం క్రికెట్ కామెంటేర్‌గా గవాస్కర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Story first published: Saturday, July 10, 2021, 17:08 [IST]
Other articles published on Jul 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+