న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యూటీ విత్‌ ట్యాలెంట్‌.. హ్యాపీ బర్త్‌డే స్మృతి మంధనా!!

Happy birthday Smriti Mandhana: Yuvraj Singh leads wishes as India opener turns 24

ముంబై: ప్రపంచంలో అందంతో పాటు ట్యాలెంట్‌ కలిగి ఉన్న వారు అతికొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఇండియన్‌ ఉమెన్‌ క్రికెటర్‌ స్మృతి మంధనా ఒకరు. అందమైన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మంధనా ఈ రోజు 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

కెరీర్‌ సాఫీగా సాగకపోయుంటే.. ఎంబీఏ చేసేవాడిని: భారత క్రికెట్ దిగ్గజంకెరీర్‌ సాఫీగా సాగకపోయుంటే.. ఎంబీఏ చేసేవాడిని: భారత క్రికెట్ దిగ్గజం

17 ఏళ్ల వయసులో అరంగేట్రం:

17 ఏళ్ల వయసులో అరంగేట్రం:

2013లో భారత జట్టులోకి అడుగుపెట్టిన స్మృతి మంధనా కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 17 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్‌పై అటు టీ20ల్లో, ఇటు వన్డేల్లో ఒకేసారి అరంగేట్రం చేశారు. అనంతరం 2014లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో రంగ ప్రవేశం చేశారు. ఇక అప్పటి నుంచి తనదైన బ్యాటింగ్‌తో అలరిస్తున్న ఆమె వన్డేల్లో ఇప్పటివరకు నాలుగు శతకాలు బాదింది. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌వుమన్‌ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

4 సెంచరీలు:

4 సెంచరీలు:

ఇప్పటివరకు 51 వన్డే మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధనా 43.1 సగటుతో 4 సెంచరీలు చేసి 2025 పరుగులు సాధించారు. వన్డేల్లో వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. 75 టీ20 మ్యాచ్‌లు ఆడి 25.2 సగటుతో 1716 పరుగులు రాబట్టారు. అంతేకాకుండా 2018లో బీసీసీఐ ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018లో ఐసీసీ ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రధానం చేసింది. ఇదే సమయంలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యారు.

మీరు ఇలాగే రాణించాలి:

24వ పుట్టినరోజు జరుపుకొంటున్న ఆమెకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ ‌సింగ్‌ ట్విటర్‌లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు స్మృతి మంధనా. మీరు ఇలాగే రాణించడం కొనసాగించాలి. భారత జట్టులో ఈ ఎడమచేతి వాటం గల బ్యాట్స్‌మెన్‌ చాలా ఖ్యాతిని కలిగి ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి' అని యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు.

వన్డేల్లో వేగంగా 2000 పరుగులు:

వన్డేల్లో వేగంగా 2000 పరుగులు:

'ఇంత ప్రతిభావంతులైన స్మృతి మంధనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎక్కువ పరుగులు, ఎక్కువ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. మీకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా' అని భువనేశ్వర్‌ కుమార్‌ ట్వీట్‌ చేశాడు.

'పుట్టినరోజు శుభాకాంక్షలు మంధనా. మీరు మీ అదృష్టం, మరియు సక్సెస్‌ను ఇలాగే కొనసాగించాలి' అని శిఖర్ ధావన్‌ ట్వీట్‌ చేశాడు.

'సేన నేషన్స్‌లో ఓడీ సెంచరీలు చేసిన మొదటి మహిళ. వన్డేల్లో వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న మహిళా బ్యాట్స్‌మెన్‌ మంధనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని బీసీసీఐ ఉమెన్స్‌ ట్వీట్‌ చేసింది.

ఐసీసీ కూడా మంధనాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె బ్యాటింగ్‌ చేస్తున్న క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Story first published: Saturday, July 18, 2020, 16:53 [IST]
Other articles published on Jul 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X