
హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పుట్టిన రోజు ఏప్రిల్ 24 సందర్భంగా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. సచిన్ 45వ పుట్టినరోజుకు క్రికెటర్లు, కామెంటేటర్లు, అభిమానులు తమ అభిమాన సీనియర్ క్రికెటర్‌కు విషెస్ పంపుతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదేళ్లు కావొస్తున్నా ఏ మాత్రం తగ్గని అతని క్రేజ్‌కు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.
టెస్టులు, వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్‌గా సచిన్ రికార్డుల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ మొత్తం 34,357 రన్స్ చేశాడు. అంతేకాదు తన బౌలింగ్‌లోనూ 200 వికెట్లు తీసుకున్నాడు. క్రికెట్ ప్రేమికుల్ని ఎంతో అలరించిన సచిన్‌కు తన ట్విట్టర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి బర్త్‌డే విషెస్ చెప్పింది. సచిన్ మొత్తం 200 టెస్టులు ఆడాడు. అందులో 51 సెంచరీలు చేశాడు. ఆ టెస్టుల్లో 15921 రన్స్ చేశాడు. ఇక 463 వన్డేలు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ వాటిల్లో 49 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 18426 రన్స్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2013లో సచిన్ రిటైరయ్యాడు.
వన్డే క్రికెట్‌లో 200 స్కోరును చేసిన మొదటి క్రికెటర్‌గా 2010వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మీద ఆడిన మ్యాచ్‌లో రికార్డు నెలకొల్పాడు. సచిన్ ఘనతను పురస్కరించుకొని 2002వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాత సచిన్ టెండూల్కర్ అంటూ విస్‌డెన్ క్రికెటర్స్ సత్కరించింది. ఇంకా వన్డే క్రికెట్‌లో వీవి రిచర్డ్స్ తర్వాత వ్యక్తి అంటూ మరో ఘనతను ఆపాదించింది. సచిన్‌ను చూసి ప్రేరణ పొందిన వాళ్లు అతని జన్మదినాన్ని గొప్పగా జరుపుకునే రోజు కావడం వాళ్లకు సంతోషదాయకం.
ఈ సందర్భంగా ఐసీసీ ట్వీట్‌లో 'లీడింగ్ టెస్ట్ పరుగుల వీరుడు, వన్డే పరుగులు యోధుడు. 200 వికెట్లతో పాటు 34,357పరుగులు తీసిన అంతర్జాతీయ క్రికెటర్. 'హ్యాపీ బర్త్ డే లిటిల్ మాస్టర్' అంటూ ట్వీట్ చేసింది.
'45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు మా శుభాకాంక్షలు.' అని ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేర్కొంది.
వింత ట్వీట్ల వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. 'అతనొక క్రికెటర్ మాత్రమే కాదు. నా ప్రపంచం కూడా. అంతే కాదు ఇంకా చాలా ఉంది. తన ఆటతో ఇండియన్ క్రికెట్‌ను ఆపేయగలవారెవరుంటారు. క్రికెట్ బ్యాట్ ను ఓ ఆయుధంగా మలచగల సత్తా అతనికే ఉంటుంది.' అని సెహ్వాగ్ కొనియాడాడు.
'బిలియన్ మంది భారతీయులను ఏకం చేసి, వారి ముఖాలపై నవ్వులు పూయించాడు. కలను నిజం చేసిన సచిన్. అతనొక ఎమోషన్. అతనొక పద్ధతి' అని రైనా సచిన్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశాడు.
అర్థరాత్రి సమయం నుంచి ట్విట్టర్లో వస్తున్న శుభాకాంక్షలకు సంతోషం వ్యక్తం చేశారు. తానే స్వయంగా స్పందించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో..'ఇంతటి ప్రేమను చూపిస్తోన్న మీకు కేవలం థ్యాంక్స్‌తో సరిపెట్టలేను. ఈ ఆదరాభిమానాలకు చాలా గ్రేట్ ఫుల్‌గా భావిస్తున్నాను.'