
హైదరాబాద్: హైదరాబాద్: ఏప్రిల్ 24... భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. 46వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ మరాఠి కుటుంబంలో పుట్టిన ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దేవుడయ్యాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన సచిన్ 200 టెస్టులాడి 100 అంతర్జాతీయ సెంచరీలతో 34,357 పరుగులు చేశాడు. భారత్ తరుపున 200 టెస్టులాడి 15,921పరుగులు, 463 వన్డేలాడి 18,426 పరుగులు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.
పుట్టినరోజు సందర్భంగా సచిన్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు వెల్లువ