For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Happy Birthday Sachin: 46వ పుట్టినరోజు నాడు 46 గ్రేటెస్ట్ రికార్డులు

Happy Birthday Sachin Tendulkar: On his 46th birthday, recalling his 46 greatest records

హైదరాబాద్: ఏప్రిల్ 24... భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. 46వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1973 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ మరాఠి కుటుంబంలో పుట్టిన ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దేవుడయ్యాడు. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన సచిన్ 200 టెస్టులాడి 100 అంతర్జాతీయ సెంచరీలతో 34,357 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తన 46 పుట్టినరోజు నాడు సచిన్ నమోదు చేసిన 46 గ్రేటెస్ట్ రికార్డులను ఓసారి గుర్తు చేసుకుందాం..

అత్యధిక సెంచరీలు

అత్యధిక సెంచరీలు

1. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు(51) సాధించిన ఏకైక క్రికెటర్. డిసెంబర్, 2010లో దక్షిణాప్రికాతో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో సచిన్ టెస్టుల్లో తన 50వ టెస్టు సెంచరీని సాధించాడు.

2. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 2008లో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా(11,953) పరుగులను సచిన్ అధిగమించాడు.

3. టెస్టుల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా బ్రియాన్ లారాతో కలిసి సంయుక్తంగా రికార్డు నెలకొల్పాడు. సచిన్, లారా ఇద్దరూ 195 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

4. సచిన్ టెండూల్కర్ తాను ఆడిన రోజుల్లో టెస్టు హోదా పొందిన ప్రతి దేశంపై సెంచరీ సాధించాడు.

169వ టెస్టు మ్యాచ్ ఆడిన సందర్భంలో

169వ టెస్టు మ్యాచ్ ఆడిన సందర్భంలో

5. శ్రీలంకపై 169వ టెస్టు మ్యాచ్ ఆడిన సందర్భంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ స్టీవ్ వా పేరిట ఉన్న రికార్డుని సచిన్ అధిగమించాడు.

6. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి.

7. టెస్టుల్లో(51), వన్డేల్లో (49) అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రెండు ఫార్మాట్లు కలిపి సచిన్ సెంచరీ సెంచరీలను నమోదు చేశాడు.

100వ సెంచరీ

100వ సెంచరీ

8. మార్చి, 2012లో సచిన్ టెండూల్కర్ 100వ సెంచరీని సాధించాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ మైలురాయిని అందుకున్నాడు.

9. ప్రపంచ క్రికెట్‌లో అటు టెస్టుల్లోనూ(200), ఇటు వన్డేల్లోనూ(463) అత్యధిక మ్యాచ్‌లు ఆటగాడిగా సచిన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

10. భారత క్రికెట్ జట్టు సాధించిన అత్యధిక విజయాల్లో సచిన్ భాగస్వామిగా ఉన్నాడు. సచిన్ ఆడిన రోజుల్లో టెస్టుల్లో 72, వన్డేల్లో 234 టీమిండియా విజయం సాధించింది.

11. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ 150కి పైగా 20 సార్లు స్కోర్లు నమోదు చేశాడు.

టెస్టు హోదా కలిగిన దేశాలలపై

టెస్టు హోదా కలిగిన దేశాలలపై

12. ఐసీసీ పుల్ మెంబర్స్(టెస్టు హోదా కలిగిన దేశాలు) అన్ని దేశాలపై సచిన్ టెండూల్కర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.

13. ఒక కేలండర్ ఇయర్‌లో 1000కిపైగా టెస్టు పరుగులను సచిన్ టెండూల్కర్ 6 సార్లు (1997, 1999, 2001, 2002, 2008 and 2010) సాధించాడు. ఇదే ఇప్పటివరకు ప్రపంచ రికార్డు.

14. టెస్టుల్లో సచిన్ తన తొలి సెంచరీని నమోదు చేసినప్పుడు వయసు 17 ఏళ్ల 197 రోజులు.

15. టెస్టు క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్-రాహుల్ ద్రవిడ్ ఇద్దరూ కలిసి 20 సార్లు సెంచరీకి పైగా భాగస్వామ్యాలను నెలకొల్పారు. టెస్టుల్లో ఓ జోడి అత్యధిక సార్లు సెంచరీకి పైగా భాగస్వామ్యాలను నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

51 సెంచరీల్లో 22 స్వదేశంలోనే

51 సెంచరీల్లో 22 స్వదేశంలోనే

16. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ సాధించిన 51 సెంచరీల్లో 22 స్వదేశంలో సాధించగా... 29 విదేశాల్లో సాధించాడు. విదేశీ గడ్డపై ఇన్ని సెంచరీలు సాధంచడం కూడా ప్రపంచ రికార్డే.

17. ఇక, వన్డేల విషయానికి వస్తే వన్డేల్లో మొదట డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ సచినే.

18. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీలు(49) సాధించడంతో పాటు... 50కిపైగా పరుగులను 145 సార్లు నమోదు చేశాడు.

19. 1998లో సచిన్ టెండూల్కర్ ఒక కేలండర్ ఇయర్‌లో 1894 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డుని ఏ క్రికెటర్ కూడా బద్దలు కొట్టలేదు.

ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక సెంచరీలు

ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక సెంచరీలు

20. ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ సచిన్.(1998లో 9 సెంచరీలు చేశాడు)

21. సచిన్ తన ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు సాధించాడు.

22. వన్డేల్లో అత్యధిక బౌండరీలు బాదిన క్రికెటర్ కూడా సచినే. వన్డేల్లో సచిన్ 2016 సెంచరీలు బాదాడు.

23. సచిన్ వన్డేల్లో 200 పరుగులు చేసిన మ్యాచ్‌లో 25 బౌండరీలు బాదాడు. ఒక మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదింది కూడా సచిన్.

అత్యధిక వన్డే మ్యాచ్‍‌లు

అత్యధిక వన్డే మ్యాచ్‍‌లు

24. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‍‌లు (463) ఆడిం క్రికెట్ కూడా సచినే

25. సచిన్ అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (26) అందుకున్నాడు. ఇందులో వరల్డ్‌కప్‌లో అందుకున్న 9 కావడం విశేషం.

26. సచిన్ అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డులు (15) అందుకున్నాడు.

27. మొత్తంగా చూస్తే సచిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు(76), ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డులు(20) అందుకున్నాడు.

భారత్ తరుపున 185 వన్డేలు

భారత్ తరుపున 185 వన్డేలు

28. 1990 నుంచి 1998 మధ్య కాలంలో సచిన్ భారత్ తరుపున 185 వన్డేలాడాడు.

29. ఒక కేలండర్ ఇయర్‌లో 1000కిపైగా పరుగులను 7 సార్లు (1994, 1996, 1997, 1998, 2000, 2003 and 2007) సాధించాడు.

30. క్రిస్ గేల్, మార్లిన్ శామ్యూల్స్‌కు ముందు 2015లో వన్డేల్లో అత్యధిక పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా సచిన్-ద్రవిడ్(331 vs New Zealand in 1999) పేరిట రికార్డు ఉంది.

31. సచిన్-గంగూలీ ఇద్దరూ కలిసి 26 సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఇందులో 21 సెంచరీ భాగస్వామ్యాలు ఓపెనింగ్ వికెట్‌కు కావడం విశేషం. ఇది కూడా ప్రపంచ రికార్డే.

90 వేదికల్లో

90 వేదికల్లో

32. సచిన్-గంగూలీ ఇద్దరూ కలిసి 8227 పరుగులు సాధించారు. ఇక, ఓపెనర్లుగా వీరిద్దరూ 6609 పరుగులు సాధించారు.

33. వన్డే క్రికెట్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 90 వేదికల్లో సచిన్ ఆడాడు. ఇంతవరకు ఎవరూ ఈ రికార్డుని అందుకోలేకపోయారు.

34. సింగిల్ టీమ్‌పై సచిన్ చేసిన పరుగులు: vs శ్రీలంకపై (3113 runs), vs ఆస్ట్రేలియాపై (3077 runs).

35. 20 ఏళ్లకు ముందే సచిన్ 5 టెస్టు సెంచరీలను నమోదు చేశాడు.

2011లో చివరి వన్డే వరల్డ్‌కప్

2011లో చివరి వన్డే వరల్డ్‌కప్

36. 2011లో సచిన్ తన చివరి వన్డే వరల్డ్‌కప్ ఆడాడు.

37. వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 6 సెంచరీలు, 21 సార్లు 50కిపైగా పరుగులు సాధించాడు.

38. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ 7 సార్లు తన బ్యాట్‌ని పైకి లేపాడు. ఈ వరల్డ్‌కప్‌లో సచిన్ మొత్తం 673 పరుగులు సాధించాడు.

39. టెండూల్కర్, జావేద్ మియాందాద్(పాకిస్థాన్) ఇద్దరూ అత్యధికంగా 6 సార్లు వన్డే వరల్డ్‌కప్‌ టోర్నమెంట్ ఆడారు.

150కిపైగా వికెట్లు

150కిపైగా వికెట్లు

40. సచిన్ తన బౌలింగ్‌లో 150కిపైగా వికెట్లను పడగొట్టాడు.

41. వన్డేల్లో 90 పరుగుల వద్ద సచిన్ 18 సార్లు ఔటయ్యాడు. ఇందులో మూడు సార్లు 99 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

42. ఇక, టెస్టు క్రికెట్ విషయానికి వస్తే 90 పరుగుల వద్ద 10సార్లు పెవిలియన్‌కు చేరాడు.

43. హారిస్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా సెయింట్ జేవియర్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 326 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మొట్టమొదటి విదేశీ ప్లేయర్

మొట్టమొదటి విదేశీ ప్లేయర్

44. రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కరే.

45. 1990-91 మధ్య కాలంలో యార్క షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి విదేశీ ప్లేయర్.

46. సచిన్‌ అందుకున్న పురస్కారాలు:

• 1994లో అర్జున అవార్డు

• 1997లో రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు

• 1999లో పద్మశ్రీ అవార్డు

• 2008లో పద్మ విభూషణ్‌

• 2014లో భారత రత్న

Story first published: Wednesday, April 24, 2019, 15:53 [IST]
Other articles published on Apr 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+