Rohit Sharma: అతడి పేరు రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్. బ్యాట్ పడితే బంతిని బాదడమే అతడి పని. అందుకే అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుస్తారు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవలు అందిస్తూ కెరీర్ లో ఎన్ని రికార్డులు తిరగరాశాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నేడు అతడి పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). 38లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రోహిత్ మాత్రమే సాధించిన ఓ అరుదైన ఘనతను నెమరువేసుకుందాం...
సిక్సుల మోత..
ఫార్మాట్ ఏదైనా బ్యాట్ పడితే బంతిని బాదడమే పని పెట్టుకుంటాడు రోహిత్ శర్మ. సిక్సుల మోత మోగిస్తుంటాడు. ఇప్పటి వరకు కెరీర్ లో ఏకంగా 637 సిక్స్‌లు బాదాడు. తద్వారా అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా ప్రపంచ కప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ వన్డే టోర్నిల్లోనూ అత్యధిక సిక్సులు బాది టాప్ లో నిలిచాడు. మొత్తం 68 సిక్సులు కొట్టాడు.
ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ కూడా రోహితే. ఆస్ట్రేలియాపై 132 సిక్స్‌ల మోత మోగించాడు. సిక్సుల్లోనే కాదు ఫోర్లలోనూ రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. కెరీర్ లో ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడు రోహితే. 264 పరుగుల ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు బాదాడు.

ప్రపంచ కప్‌లో శతకాల మోత..
ఒక ప్రపంచ కప్‌లో ఏ బ్యాటర్ కూడా సాధించని ఓ రికార్డ్ రోహిత్ ఖాతాలో ఉంది. అదే సెంచరీల రికార్డ్. 2019 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 5 సెంచరీలు బాదాడం విశేషం.
ప్రస్తుతం రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతోన్న అతడు..ఆడిన 9 మ్యాచుల్లో 240 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.