Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్.. రోహిత్‌పై విషెస్ వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్!

ఇప్పటి వరకు చాలా మంది ప్లేయర్లు క్రికెట్ ఆడారు. కానీ కొందరే ప్రపంచం క్రికెట్‌పై తనదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో ఒకడు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పుడున్న టీమిండియా ఆటగాళ్లు అందరిలోకి సీనియర్ ఆటగాడైన రోహిత్.. ఒకానొక సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడమే గగనంగా మారింది. అయితే అతనిలో ట్యాలెంట్ గుర్తించిన ధోనీ.. రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశాడు.

ఆ నిర్ణయం రోహిత్ కెరీర్‌ను మార్చేసింది. ఓపెనర్‌గా అదరగొట్టిన అతను.. వన్డేల్లో అసాధ్యం అనుకునే డబుల్ సెంచరీని మూడుసార్లు బాదాడు. శ్రీలంకపై అయితే ఏకంగా 264 పరుగులు చేసి అవసరమైతే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసే సత్తా తనకుందని నిరూపించాడు. అంతేకాదు, ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలో నెగ్గి తనలో నాణ్యమైన సారధి కూడా ఉన్నాడని చాటిచెప్పాడు. వైట్ బాల్ గ్రేట్‌లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు.

Happy Birthday Rohit

ఇప్పుడంటే రోహిత్ బౌలింగ్ వేయడం లేదు కానీ.. ఒకప్పుడు బౌలింగ్‌లోనూ హిట్‌మ్యాన్ దిట్టే. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో రోహిత్ ఒకడనే విషయం మర్చిపోతే ఎలా? అందుకే హిట్‌మ్యాన్‌కు భారత్‌లో అడుగడుగునా అభిమానులే. అతన్ని ఎవరూ చూసినా సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ప్రపంచంలో బౌలర్లు ఎక్కువ భయపడే బ్యాటర్లలో కూడా రోహిత్ పేరు కచ్చితంగా ఉంటుంది.

అలాంటి రోహిత్ శర్మ బర్త్‌డే వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? హైదరాబాద్‌లోనే అత్యంత భారీ కటౌట్‌లో హిట్‌మ్యాన్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ టీం కూడా రోహిత్ కోసం ప్రత్యేక ఫొటోషూట్ చేయించింది. నెటిజన్లు కూడా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో 'హ్యాపీ బర్త్‌డే రోహిత్', 'హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్' హ్యాష్ ట్యాగ్‌లు ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఎందుకు ఆలస్యం? మనం కూడా హిట్‌మ్యాన్‌కు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం పదండి.

Story first published: Sunday, April 30, 2023, 9:32 [IST]
Other articles published on Apr 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+