Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Athiya Shetty-KL Rahul: ఊహాగానాల‌కు చెక్ .. ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేసిన టీమిండియా క్రికెటర్!!

Happy birthday my love: KL Rahuls Birthday Post For Athiya Shetty.

దుబాయ్: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ హీరోయిన్ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే తాజాగా తమ మధ్య ఉంది ప్రేమే అని సోషల్ మీడియాలో రాహుల్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. శుక్రవారం అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా రాహుల్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది.

శుక్రవారం (నవంబర్ 5) బాలీవుడ్​ నటి అతియా శెట్టి పుట్టిన రోజు. నిన్నటితో ఆమె 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. అతియా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త‌న ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశాడు. ఇరువురు కలిసి దిగిన ఓ చిత్రాన్ని ఇన్‌స్టాలో పెట్టిన రాహుల్.. 'హ్యాపీ బర్త్​డే మై లవ్' అని క్యాప్షన్​ ఇచ్చాడు. దీంతో వీరి ప్రేమ వ్యవహారంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది. మొత్తానికి అతియానే తన ప్రేయసి అని రాహుల్ ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం అతియా యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. అతియా పుట్టిన రోజున రాహుల్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ బౌండరీలు బాదుతుంటే.. అతియా ఆనందంలో మునిగిపోయింది.

కేఎల్ రాహుల్‌, అతియా శెట్టిల మ‌ధ్య రిలేష‌న్ ఉన్న‌ట్లు 2019లోనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. వాళ్లు డేటింగ్‌లో ఉన్న‌ట్లు నెట్టింట వార్త‌లు వచ్చాయి. అప్పటినుంచి పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. జూలైలో ఈ ఇద్ద‌రూ త‌మ కామ‌న్ ఫ్రెండ్ సోనాలి ఫాబియానాతో దిగిన ఫోటోల‌ను వేరువేరుగా పోస్టు చేశారు. అప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రి రిలేష‌న్‌పై అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆగ‌స్టులో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంది. రాహుల్‌తో చేసిన ఓ ఫోటోషూట్‌కు చెందిన పిక్‌ల‌ను కూడా అతియా త‌న ఇన్‌స్టాలో ఇటీవ‌ల పోస్టు చేసింది. తాజాగా అతియా పుట్టిన రోజుతో ఆ రూమ‌ర్స్‌కు చెక్ ప‌డిన‌ట్లు అయ్యింది.

గత కొన్నేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌, అతియా శెట్టిలు పెళ్లి చేసుకుంటే.. మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి దంప‌తులు ఇదివ‌ర‌కే పేర్కొన్నారు. 'హీరో', 'మోతిచూర్ చక్నాచూర్', 'నవాబ్​జాదే', 'ముబారకాన్' వంటి చిత్రాలతో అతియా ప్రేక్షకుల్ని అలరించింది. మరోవైపు లోకేష్ రాహుల్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్​ 2021లో అదరగొడుతున్నాడు. శుక్రవారం స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. దాంతో టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ భారత్ తరఫున 40 టెస్టులు, 38 వన్డేలు, 53 టీ20లు ఆడాడు. మరోవైపు 94 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

Story first published: Saturday, November 6, 2021, 13:27 [IST]
Other articles published on Nov 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+