36వ పడిలోకి మిథాలీ: వన్డేల్లో ఏకైక క్రికెటర్‌గా చరిత్ర, మద్ధతుగా ఫ్యాన్స్

హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మిథాలీ రాజ్. అంతలా భారత మహిళల క్రికెట్‌లో మిథాలీ భాగస్వామ్యమైంది. 17 ఏళ్లకే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ వన్డేల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
ఇటీవలే వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ నుంచి మిథాలీని తప్పించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో మిథాలీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. అంతేకాదు ఈ వివాదం చివరకు బీసీసీఐ వద్దకు చేరడంతో బోర్డు సైతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా కోచ్ రమేశ్ పవార్ పదవీ కాలం నవంబర్ 30తో ముగిసింది. అయితే కోచ్ పదవీకాలం పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ.. మిథాలీ-పొవార్ నెలకొన్న మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు గాను ఆయన్ను కోచ్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ అంగీకరించలేదు.

ఆవేదన వ్యక్తం చేసిన మిథాలీరాజ్
సెమీఫైనల్ మ్యాచ్ నుంచి తనని తప్పించడంపై మిథాలీ రాజ్ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తన కెరీర్‌ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. ఇప్పుడు తన దేశభక్తిని సందేహిస్తూ.. నైపుణ్యాల్ని కొందరు ప్రశ్నిస్తున్నారంటూ మిథాలీ బాధపడిన సంగతి తెలిసిందే.

36వ పుట్టినరోజుని జరుపుకుంటున్న మిథాలీ
కాగా, సోమవారం మిథాలీ రాజ్ 36వ పుట్టినరోజు. జోధ్‌పూర్‌లో డిసెంబరు 3, 1982లో జన్మించిన మిథాలీ రాజ్.. పదేళ్ల వయసులోనే క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. ఈ క్రమంలో 1999లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన మిథాలీ రాజ్, తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌పై 114 పరుగులతో అజేయంగా నిలిచింది.

2002లో 214 పరుగులు చేసిన మిథాలీ
ఇక, టెస్టు క్రికెట్‌లో 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగులు చేసి.. మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్‌గా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే కావడం విశేషం.

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సరికొత్త రికార్డులు
సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన మిథాలీ వరల్డ్ కప్‌లో టీమిండియాను రెండు సార్లు (2005, 2017) ఫైనల్‌కి చేర్చింది. టీ20ల్లోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గానూ ప్రస్తుతం కొనసాగుతోంది. కెరీర్‌లో మొత్తం 120 వన్డేలకి నాయకత్వం వహించిన మిథాలీ.. ఏకంగా 51 హాఫ్ సెంచరీలు సాధించింది.
36వ పుట్టినరోజుని జరుపుకుంటున్న మిథాలీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు:
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications