న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాపీ బర్త్‌డే 'గోట్'.. సమోసా ట్రీట్‌ ఇవ్వాలి

Yuzvendra Chahal Is ''GOAT', Says Rohit Sharma's Birthday Wish For Spinner
Rohit Sharma Wish For Yuzvendra Chahal

ఈ రోజు టీమిండియా రిస్ట్ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ పుట్టినరోజు. చహల్‌ ఈ రోజుతో 29వ వసంతంలోకి అడుపెట్టాడు. ఈ సందర్భంగా చహల్‌ సన్నిహితులు, . టీమిండియా క్రికెటర్లు, అభిమానులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు తన ట్విట్టర్ ఖాతాలకు పని చెప్పారు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. క్రికెట్‌ అభిమానులు సైతం ఈ రోహిత్‌ ట్వీట్‌పై స్పందిస్తున్నారు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

'అత్యుత్తమ పుట్టినరోజు జరుపుకోవాలి గోట్' అంటూ రోహిత్‌ శర్మ వెరైటీగా చహల్‌కు విషెస్‌ తెలిపాడు. 'చిన్న తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ట్వీట్ చేసాడు. అంతేకాదు.. ఈసారి సమోసా ట్రీట్‌ ఇవ్వమని కోరాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు' అని సురేష్ రైనా ట్వీట్ చేసాడు. 'పరిమిత ఓవర్ల స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌కు 29వ పుట్టినరోజు శుభాకాంక్షలు' అని క్రికెట్ వరల్డ్ కప్ ట్వీట్ చేసింది.

ఇక బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. చాహల్‌ టీవీకి సంబంధించిన సరదా ఘటనలను ఒక వీడియోగా రూపొందించి హ్యాపీ బర్త్‌డే 'గూఫ్ బాల్' అని పోస్టు చేసింది. సన్నిహితులు, అభిమానులు కూడా చహల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.

వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టులో మాత్రమే చహల్‌ చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు టి20ల కోసం కొత్త స్పిన్నర్లను ఎంచుకున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌లను ఎంపిక చేసుకున్నారు. ప్రపంచకప్‌లో ప్రభావం చూపకపోవడంతో చహల్‌పై వేటు పడింది.

Story first published: Tuesday, July 23, 2019, 16:27 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X