హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా గబ్బర్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్ వేదికగా బీసీసీఐ, ఐసీసీ, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గబ్బర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాయి. అతడు మరింత బాగా రాణించాలని ఆకాంక్షించాయి. ధావన్ తన బ్యాటింగ్‌తో భారత అభిమానులను అలరించాలని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ ట్వీట్లు చేశారు.
100% Swag 😎
— Delhi Capitals (@DelhiCapitals) December 4, 2020
200% Entertainment 🤩
300% Happiness ☺️
Wishing @SDhawan25, the man who's an emotion within himself, a very Happy Birthday 🎂💙#YehHaiNayiDilli #HappyBirthdayGabbar pic.twitter.com/qUOkk6VKqo
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. అందులో ధావన్ యువకుడిగా ఉన్నప్పటి ఫొటోను అభిమానులతో పంచున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్విన్నూతంగా ట్వీట్ చేసింది. 100% నిజాయితీ, 200% వినోదం, 300% ఆనందం= గబ్బర్ అని పేర్కొంది. 'పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలి. త్వరలో మరో డ్యాన్స్ వీడియో చూడాలని ఆశిస్తున్నా' అని సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
Happy birthday brother @SDhawan25 .. Lots of love to you and your family.. Hope to see another dance video soon 😃 #HappyBirthdayGabbar pic.twitter.com/7Sa9fzK56z
— Suresh Raina🇮🇳 (@ImRaina) December 5, 2020
2004 అండర్-19 వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఢిల్లీ తరుపున తన అరంగేట్ర రంజీ మ్యాచ్‌లో 187 పరుగులతో సెంచరీ సాధించాడు. రంజీల్లో ఓ అరంగేట్ర ఆటగాడు బాదిన అత్యధిక స్కోరు ఇది. ధావన్ మెరుపు వేగంతో బంతిని బౌండరీకి తరలించగలడు. అందుకే అభిమానులు అతడిని ముద్దుగా 'గబ్బర్' అని పిలుచుకుంటారు. తన కంటే వయసులో పదేళ్లు పెద్దదైన బెంగాలీ బ్యూటీ ఆయేషాను శిఖర్ ధావన్ వివాహామాడాడు. వీరికి ఒక కుమారుడు. ఆయేషాకు అంతకముందే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Many Many happy returns of the day to a ever smiling guy I admire a lot , @SDhawan25 . Sasural mein khoob khoob run banao baaki matches mein bhi aur har khushi manaao. May you get to have many more celebrations , itni ki jaanghein laal ho jaayein . pic.twitter.com/8U5MVHLlaX
— Virender Sehwag (@virendersehwag) December 5, 2020
శిఖర్ ధావన్‌కు టాటూ అంటే తెగ ఇష్టం. అందుకే తల్లిదండ్రులకు తెలియకుండా 15 ఏళ్ల వయసులోనే తన శరీరంపై టాటూ వేయించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఫేమస్ ఇండియన్ క్రికెట్ కోచ్ తారక్ సిన్హా వద్ద ధావన్ శిక్షణ తీసుకున్నాడు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 134 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. మొత్తంగా 24 శతకాలు బాదాడు.
India vs Australia: జడేజా విధ్వంసం.. ధోనీ 8 ఏళ్ల రికార్డ్ బ్రేక్!!