Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Happy Birthday Shikhar Dhawan: 100% నిజాయితీ, 200% వినోదం, 300% ఆనందం= గబ్బర్‌

Happy Birthday Gabbar: Shikhar Dhawan Turns 35

హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ శనివారం 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా గబ్బర్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్‌ వేదికగా బీసీసీఐ, ఐసీసీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా గబ్బర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాయి. అతడు మరింత బాగా రాణించాలని ఆకాంక్షించాయి. ధావన్ తన బ్యాటింగ్‌తో భారత అభిమానులను అలరించాలని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్లు చేశారు.

డాషింగ్‌ ఓపెనర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. అందులో ధావన్‌ యువకుడిగా ఉన్నప్పటి ఫొటోను అభిమానులతో పంచున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌విన్నూతంగా ట్వీట్ చేసింది. 100% నిజాయితీ, 200% వినోదం, 300% ఆనందం= గబ్బర్ అని పేర్కొంది. 'పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలి. త్వరలో మరో డ్యాన్స్ వీడియో చూడాలని ఆశిస్తున్నా' అని సురేష్ రైనా ట్వీట్ చేశాడు.

2004 అండర్-19 వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఢిల్లీ తరుపున తన అరంగేట్ర రంజీ మ్యాచ్‌లో 187 పరుగులతో సెంచరీ సాధించాడు. రంజీల్లో ఓ అరంగేట్ర ఆటగాడు బాదిన అత్యధిక స్కోరు ఇది. ధావన్ మెరుపు వేగంతో బంతిని బౌండరీకి తరలించగలడు. అందుకే అభిమానులు అతడిని ముద్దుగా 'గబ్బర్' అని పిలుచుకుంటారు. తన కంటే వయసులో పదేళ్లు పెద్దదైన బెంగాలీ బ్యూటీ ఆయేషాను శిఖర్ ధావన్ వివాహామాడాడు. వీరికి ఒక కుమారుడు. ఆయేషాకు అంతకముందే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శిఖర్ ధావన్‌కు టాటూ అంటే తెగ ఇష్టం. అందుకే తల్లిదండ్రులకు తెలియకుండా 15 ఏళ్ల వయసులోనే తన శరీరంపై టాటూ వేయించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఫేమస్ ఇండియన్ క్రికెట్ కోచ్ తారక్ సిన్హా వద్ద ధావన్ శిక్షణ తీసుకున్నాడు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 134 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. మొత్తంగా 24 శతకాలు బాదాడు.

Story first published: Saturday, December 5, 2020, 17:02 [IST]
Other articles published on Dec 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+