Happy birthday Gabbar: 34వ పడిలోకి ధావన్, ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ వెల్లువ

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గురువారం(డిసెంబర్ 5)న 34వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అటు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు అతడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2004 అండర్-19 వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఢిల్లీ తరుపున తన అరంగేట్ర రంజీ మ్యాచ్‌లో 187 పరుగులతో సెంచరీ సాధించాడు. రంజీల్లో ఓ అరంగేట్ర ఆటగాడు బాదిన అత్యధిక స్కోరు ఇది.

అభిమానులు పెట్టిన ముద్దు పేరు 'గబ్బర్'
ధావన్ మెరుపు వేగంతో బంతిని బౌండరీకి తరలించగలడు. అందుకే అభిమానులు అతడిని ముద్దుగా 'గబ్బర్' అని పిలుచుకుంటారు. తన కంటే వయసులో పదేళ్లు పెద్దదైన బెంగాలీ బ్యూటీ ఆయేషాను శిఖర్ ధావన్ వివాహామాడాడు. వీరికి ఒక కుమారుడు. ఆయేషాకు అంతకముందే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

15 ఏళ్ల వయసులోనే టాటూ
ధావన్‌కు టాటూ అంటే తెగ ఇష్టం. అందుకే తల్లిదండ్రులకు తెలియకుండా 15 ఏళ్ల వయసులోనే తన శరీరంపై టాటూ వేయించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఫేమస్ ఇండియన్ క్రికెట్ కోచ్ తారక్ సిన్హా వద్ద ధావన్ శిక్షణ తీసుకున్నాడు.

ధావన్‌ను వేధిస్తోన్న ఫామ్ లేమి
అయితే, ఈ మధ్య కాలంలో ఫామ్ లేమి శిఖర్ ధావన్‌ను వేధిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో శిఖర్ ధావన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న ధావన్ విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టులోకి వచ్చాడు. అయితే, ఆ సిరిస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.

చివరి ఐదు మ్యాచ్‌ల్లో ధావన్ విఫలం
ఆ తర్వాత బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లోనూ రాణించలేదు. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 41 పరుగులు మినహా మిగతా మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన సొంత జట్టు ఢిల్లీ తరఫున బరిలోకి దిగి అక్కడ కూడా నిరాశపరిచాడు. 24, 35, 19, 9, 0 చివరి ఐదు మ్యాచ్‌ల్లో ధావన్ చేసిన పరుగులివి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications