Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాప్ బర్త్ డే దాదా: సెహ్వాగ్, యువీ స్పెషల్ ట్వీట్

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం (జులై 8)న 45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు దాదాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

టీమిండియాను విజయవంతంగా నడిపించిన కెప్టెన్లలో దాదా కూడా ఒకరు. అభిమానులు ముద్దుగా 'కోల్‌కతా ప్రిన్స్‌', 'బెంగాల్‌ టైగర్‌' పేర్లతో దాదాను పిలుచుకుంటూ ఉంటారు. గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లతో నిండి ఉండేది. అలాంటి ఆస్ట్రేలియా జట్టుని సైతం గంగూలీ తనదైన శైలిలో ఢీకొట్టాడు.

2000 సంవత్సరంలో భారత క్రికెట్ సంక్లిష్టంలో ఉండగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన గంగూలీ ఎంతో సమర్థంగా జట్టుని నడిపించాడు. భారత జట్టు సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు.

భారత జట్టుకు కెప్టెన్‌గా గెలుపు రుచిని చూపించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన అనంతరం షర్ట్ విప్పి గాల్లోకి తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది.

2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ అనంతరం గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. విదేశీ గడ్డపై పేలవ రికార్డు ఉన్న టీమిండియాకు గంగూలీ తన కెప్టెన్సీలో చెరిపేశాడు. విదేశాల్లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 28 టెస్టుల్లో 11 విజయాలు సాధించడం విశేషం.

భారత తరఫున గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేలు, 77 టీ20లు ఆడారు. 49 టెస్టులకు, 147 వన్డేలకు గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్నాడు. దీంతో పాటు బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడిగా కూడా ఉన్నాడు.

ఈ కమిటీ టీమిండియా ప్రధాన కోచ్‌ని ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ కమిటీలో గంగూలీతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడి ఉంది.

గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా గంగూలీకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్‌లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.

సచిన్ టెండూల్కర్

'నీతో కలిసి ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదించాను' అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు

యువరాజ్‌ సింగ్‌

'ప్రియమైన గంగూలీ.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ దాదా' అని ట్వీట్ చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌

'జాతీయ పతాకాన్ని ఎన్నోసార్లు రెపరెపలాడించావు. లార్డ్స్‌లో చొక్కా విప్పి గాల్లో తిప్పావు. టెస్టు క్రికెట్‌లో నేను సాధించిన విజయానికి నువ్వు ఇచ్చిన అవకాశం, మద్దతే కారణం. హ్యాపీ బర్తడే గంగూలీ' అని ట్వీట్ చేశాడు.

మహ్మద్‌ కైఫ్‌

'భారత క్రికెట్‌లో మార్పును తీసుకువచ్చిన గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనెప్పటికీ ఓ లెజెండ్' అని ట్వీట్ చేశాడు.

బీసీసీఐ

'హ్యాపీ బర్త్‌డే గంగూలీ. భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం' అని బీసీసీఐ ట్వీట చేసింది.

మాజీ క్రికెటర్‌ హేమంగ్‌ బదానీ

'భారత క్రికెట్‌కి దాదా అయిన గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇండియన్‌ క్రికెట్‌ రూపు రేఖలు మార్చావు' అని ట్వీట్ చేశాడు.

ప్రజ్ఞాన్‌ ఓజా

'మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ దాదాకి జన్మదిన శుభాకాంక్షలు. బెంగాల్‌ క్రికెట్‌కి నీ సేవలు కొనసాగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Happy 45 Dada!
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+