Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరేమన్నారు: న్యూ ఇయర్ శుభాకాంక్షలతో హోరెత్తిన ట్విట్టర్

హైదరాబాద్: 2017కు ముగింపు పలికి కొత్త ఉత్సాహంతో 2018కి ప్రపంచం మొత్తం ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ సిటీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన మొట్టమొదటి నగరంగా నిలిచింది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు.

ఇక, న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని దేశ విదేశాలకు చెందిన క్రీడాకారులు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతా కొత్త అనుభవాలు, కొత్త కలలు, సంతోషాలతో సాగిపోవాలని పలువురు క్రికెటర్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

రోహిత్‌ శర్మ

'హ్యాపీ న్యూఇయర్‌. 2018 మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటున్నాను' అని టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

సురేశ్‌ రైనా

'కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త అనుభవాలు, కొత్త సంతోషాలతో ఈ ఏడాది అంతా నిండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ ఇవే నా శుభాకాంక్షలు' అంటూ క్రికెటర్ సురేశ్‌ రైనా ట్వీట్ చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌

'ఈ ఏడాది తొలి ఉదయం నుంచే మీకు సుఖం, సంతోషం, శక్తి, స్వరూపం, సంపత్తి, సఫలత, సమృద్ధి, స్వస్థతను ఆ దేవుడు అందించాలని కోరుకుంటున్నాను' అని టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్ చేశాడు.

సైనా నెహ్వాల్‌

అందరికీ హ్యాపీ న్యూఇయర్‌ అంటూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ ట్వీట్ చేసింది.

సాక్షి మాలిక్‌

'2017లో నాకు కష్ట సమయాల్లో మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మీ మద్దతే నాకు మరింత బలాన్నిచ్చింది. ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండండి' అంటూ ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

అభినవ్‌ బింద్రా

'కొత్త సవాళ్లను స్వీకరించండి. వాటిలో విజయం సాధించండి. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్‌' అంటూ షూటర్ అభినవ్‌ బింద్రా ట్వీట్ చేశాడు.

రోజర్‌ ఫెదరర్‌

'ఈ ఏడాది ఇదే నా మొదటి ట్వీట్‌. హ్యాపీ న్యూ ఇయర్‌' అంటూ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ట్వీట్ చేశాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌

'మా కుటుంబం తరఫు నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ట్వీట్ చేశాడు.

హర్భజన్‌ సింగ్‌

'హ్యాపీ న్యూ ఇయర్‌' టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ తన ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.

Story first published: Monday, January 1, 2018, 14:45 [IST]
Other articles published on Jan 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+