ఓపెనర్‌గా ఫెయిలైతే మిడిలార్డర్‌లో చోటిస్తాం: ఎమ్మెస్కే

మెల్‌బోర్న్: వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమైన ఓపెనర్లను తప్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. బాక్సింగ్ డే టెస్టులో కచ్చితంగా రాణించాలనే ఉద్దేశ్యంతో కీలక మార్పులు చేసుకుని బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో పేలవ ప్రదర్శన కారణంగా తప్పుకున్న కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌ల స్థానంలో రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్.. హనుమ విహారీలను బరిలోకి దింపనున్నట్లు సమాచారం.

ఓపెనర్‌గా ఫెయిలైతే ఏంటి పరిస్థితి
ఒకవేళ మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో హనుమ విహారి ఓపెనర్‌గా ఫెయిలైతే పరిస్థితి ఏంటని సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మిడిలార్డర్‌లో రాణిస్తోన్న టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అదే స్థానంలో కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు. మెల్‌బోర్న్ టెస్టు కోసం 11 మందితో కూడిన భారత్ జట్టుని మంగళవారం ప్రకటించింది బీసీసీఐ.

కెరీర్‌లో ఇప్పటివరకూ 2టెస్టులే
ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్టు మ్యాచ్‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన హనుమ విహారి.. కెరీర్‌లో ఇప్పటి వరకు రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అది కూడా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. దీంతో.. మెల్‌బోర్న్ టెస్టులో అతడ్ని ఓపెనర్‌గా పంపితే రాణించగలడాననే అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఓపెనర్ స్థానంలో ఫెయిలైతే.. మళ్లీ మిడిలార్డర్‌లోకి మార్చే ఆలోచనలు ఉన్నాయా అంటే ఎమ్మెస్కే ప్రసాద్ అవుననే సమాధానమిచ్చారు.

హనుమ విహారికే ఆ అవకాశం
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లోనూ అతను ఓపెనర్‌గా విఫలమైనా.. తర్వాత సిరీస్‌లో మిడిలార్డర్‌లో అవకాశాలిస్తాం' అని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో జట్టులో ప్రత్యామ్నాయ ఓపెనర్‌కి అవకాశం లేకుండాపోయింది. దీంతో.. రహానె, రోహిత్ శర్మ పేర్లు ఓపెనింగ్ స్థానం కోసం చర్చకి వచ్చినా.. ఆఖరికి తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ఆ అవకాశం దక్కనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications