విమర్శించిన బీజేపీ ఎంపీకి.. దిమ్మ‌దిరిగే రిప్లై ఇచ్చిన హ‌నుమ విహారి!!

IND VS AUS : Hanuma Vihari's Two-Word Reply To Minister Babul Supriyo’s Criticism Is Viral

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్‌; 128 బంతుల్లో 7×4), హనుమ విహారి (23 నాటౌట్‌; 161 బంతుల్లో 4×4) అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. చివరి రోజు ఆటలో విహారి, అశ్విన్‌ చూపించిన తెగువ అసమానం. వీళ్ల పట్టుదల అసాధారణం. తొడ కండరాలు పట్టేసి సరిగ్గా నడవలేని స్థితిలో విహారి.. అయితేనేం జట్టును ఓటమి నుంచి కాపాడాలనే అతని తపన ముందు ఆ గాయం చిన్నదైపోయింది. అశ్విన్ ముందు రోజు రాత్రి వెన్నునొప్పితో బాధపడి.. ఉదయం పూట బూట్లు వేసుకోవడానికి కూడా వంగలేకపోయాడు. కానీ జట్టును రక్షించాలనే ధ్యేయం ముందు ఆ నొప్పి పారిపోయింది.

 పెయిన్ కిల్లర్స్ వేసుకుని:

పెయిన్ కిల్లర్స్ వేసుకుని:

తొడ కండరాలు పట్టేయడంతో ఫిజియో సాయం తీసుకున్న హనుమ విహారి.. ఆ తర్వాత నొప్పి పెరగడంతో పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ బ్యాటింగ్‌ని కొనసాగించాడు. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోని కొంత మంది ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా అతడి నెమ్మది బ్యాటింగ్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో కూడా విహారిపై ట్విట్టర్‌లో మండిపడ్డారు. క్రికెట్ గురించి ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని చెప్పుకుంటూనే సుప్రియో.. విహారి ఇన్నింగ్స్‌ను విమ‌ర్శించారు. 7 పరుగులు చేయడానికి 109 బంతులాడినట్లు ఆ ట్వీట్‌లో గుర్తుచేసిన సుప్రియో.. ఆ విషయం చెప్పడం కూడా తనకి ఇబ్బందిగా ఉన్నట్లు వెల్లడించారు.

క్రికెట్‌ని కూడా హత్య చేశాడు:

క్రికెట్‌ని కూడా హత్య చేశాడు:

'7 పరుగులు చేయడానికి 109 బంతులాడాడు. ఈ విషయం చెప్పడం కూడా నాకు ఇబ్బందిగా ఉంది. మ్యాచ్‌లో హనుమ బిహారి.. టీమిండియా చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని చంపేయడమే కాకుండా క్రికెట్‌ని కూడా హత్య చేశాడు. విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం నేర‌మే అవుతుంది' అని బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. చివరలో తనకి క్రికెట్‌ గురించి ఏమీ తెలియదని కూడా ఒప్పుకున్నారు. అయితే అందులో హ‌నుమ విహారి పేరును త‌న‌కు అల‌వాటైన నార్త్ ఇండియ‌న్ స్టైల్లో హ‌నుమ బిహారి అని రాశారు.

 ఏమాత్రం ప‌ట్టించుకోకుండా:

ఏమాత్రం ప‌ట్టించుకోకుండా:

బాబుల్ సుప్రియో ట్వీట్‌‌ని చాలా మంది నెటిజన్లు విమర్శించారు. హనుమ విహారి గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. చివరి సెషన్‌లో అతని ఇన్నింగ్స్‌ ఎలా విలువైందో వివరిస్తూ మండిపడ్డారు. సుప్రియో ట్వీట్‌పై హనుమ విహారి కూడా స్పందించాడు. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా సింపుల్‌గా త‌న పేరు త‌ప్పు రాశార‌ని చెప్పేలా 'హ‌నుమ విహారి' అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైకి నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. ట్వీట్ ఆఫ్ ద డెకేడ్ అని ఒక‌రు, ఎపిక్ అని మ‌రొక‌రు విహారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. విహారి చేసిన ట్వీట్‌కు అర‌గంట‌లోనే 8 వేలకుపైగా రీట్వీట్లు, 26 వేల‌కుపైగా లైక్స్ రావ‌డం విశేషం.

నాలుగో టెస్టుకి దూరం:

తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకి హనుమ విహారి దూరమయ్యాడు. విహారి దూరమవడంతో రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆడే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ గాయం కారణంగా ఆడుతాడో లేదో తెలియదు కాబట్టి.. సాహా తుది జట్టులో ఆడనున్నాడు.

కశ్యప్‌కు షాక్!! తొలి రౌండ్‌లోనే సౌరభ్, సమీర్ కూడా ఇంటికే!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, January 13, 2021, 20:41 [IST]
Other articles published on Jan 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X