తప్పు జరుగుతోంది.. IPLలో ఆ రూల్ మార్చాల్సిందే! : హనుమ విహారి
తెలుగు క్రికెటర్ హనుమ విహారి కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లోని ఓ రూల్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇంతకీ ఆ రూల్ ఏంటి?, ఎందుకు మార్చాలని అతడు అభిప్రాయపడ్డాడు? తెలుసుకుందాం..
అక్కడి వరకు అంతా ఓకే...
తాజాగా ఉత్కంఠభరితంగా జరిగిన ముంబయి ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 12 పరుగుల తేడాతే ఆర్సీబీ గెలిచింది. ఇందులో మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (67; 42 బంతుల్లో 8×4 2×6), రజత్ పటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6), జితేశ్ శర్మ (40 నాటౌట్; 19 బంతుల్లో 2×4, 4×6) దేవదత్ పడిక్కల్ (37) రాణించారు.

ఇక్కడ కథ మారింది..
అయితే ఓ దశలో ఆర్సీబీ స్కోర్ బోర్డును రజత్ పటీదార్ తో కలిసి జితేశ్ శర్మ ముందుకుతీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అప్పుడు చివరి ఓవర్‌ను ముంబయి బౌలర్ బుమ్రా వేయగా.. ఆ ఓవర్‌లో ఐదో బంతికి జితేశ్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బుమ్రా... స్టంప్స్ ముందు జితేశ్ దొరికేలా ట్రాప్ చేశాడు. దీంతో ఫీల్డింగ్ టీమ్.. ఎల్బీ కోసం అప్పీలు చేస్తే.. అంపైర్ ఔట్ గా ప్రకటించాడు.
హనుమ విహారి అసహనం..
అయితే ఆ వెంటనే జితేశ్ సింగిల్ తీసి డీఆర్‌ఎస్ కోరాడు. రివ్యూలో బంతి ఆఫ్‌స్టంప్‌కు బయట పడినట్లు కనిపించడంతో నాటౌట్‌గా తేలింది. అయినా కూడా అప్పటికే డెడ్‌బాల్‌గా ప్రకటించడం వల్ల.. జితేశ్ తీసిన పరుగును కౌంట్ చేయలేదు. ఇప్పుడు దానిపైనే తీవ్ర చర్చ మొదలైంది. హనుమ విహారి కూడా దీనిపైనే స్పందించాడు. నాటౌట్ గా తిరిగి ప్రకటించినప్పుడు.. అప్పటికే పరుగు తీసి ఉంటే దానిని కూడా లెక్కలోకి పరిగణించాలని చెప్పాడు.
మార్చాల్సిన అవసరం ఉంది..
"ఓ రూల్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. RCB ఇన్నింగ్స్ చివరి బంతిని చూస్తే.. జితేశ్ శర్మను ఫీల్డ్ లో ఔట్ గా ప్రకటించారు. ఆ తర్వాత రివ్యూ కోరితే ఆఫ్‌స్టంప్ ఆవల బంతి పడటం వల్ల రివ్యూలో ఔట్ ఇవ్వలేదు. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే.. పరుగును లెక్కలోకి తీసుకోలేదు. ఒకవేళ అంపైర్ ఔట్ ఇవ్వకపోయి ఉంటే, రన్ కౌంట్ అయ్యేది. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ కావడం వల్ల పెద్ద నష్టం కాలేదు. అదే రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో ఇలా జరిగితే పరిస్థితేంటి. అప్పుడు ఒక అంపైర్ తప్పుడు నిర్ణయం మైదానంలో ఉన్న రెండు జట్ల భవిష్యత్తును తేలుస్తుంది. ఇది న్యాయంగా అనిపిస్తుందా? కాబట్టి ఈ నిబంధనల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని విహారి పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications