Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్ధరాత్రి ప్రేయసి కోసం గేటు దూకిన టీమిండియా స్టార్ క్రికెటర్!!

Hanuma Vihari jumped over a wall in the midnight to meet his girlfriend Preethi Raj

హైదరాబాద్: అర్ధరాత్రి హీరోలు తమ ప్రేయసి ఇంటికి వెళ్లి.. గేటుకు తాళం వేసి ఉంటే గోడ దూకడం మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. అయితే.. నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇందుకు ఉదాహరణే మన హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా స్టార్ ప్లేయర్ హనుమ విహారి. విహారి ఇలాంటి పని చేశాడంటే ఎవరూ నమ్మకపోవచ్చు.. కానీ ఇదే నిజం. అర్ధరాత్రి ప్రేయసి కోసం గేటు దూకా అని స్వయంగా విహారినే చెప్పాడు. ఇటీవల క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమ విహారి తన ప్రేమ విషయాలను పంచుకున్నాడు.

ప్రీతిరాజ్ గుర్తొచ్చింది

ప్రీతిరాజ్ గుర్తొచ్చింది

క్రిక్‌బజ్‌తో హనుమ విహారి మాట్లాడుతూ... 'నా ప్రాణ స్నేహితుడు, నేను చాలా పార్టీలకు వెళుతుంటాం. ఒకరోజు ఇద్దరం అర్ధరాత్రి దాటేవరకు హైదరాబాద్‌లోని ఓ క్లబ్‌లో ఉన్నాం. అట్నుంచి డిన్నర్‌ కోసం ఓ డ్రైవ్‌ఇన్‌కు వెళ్లాం. ఆలా వెళుతుండగా ఒక్కసారిగా నాకు ప్రీతిరాజ్ గుర్తొచ్చింది. ఆమెను కలవాలనుకున్నా. అయితే ప్రీతి తల్లిదండ్రులతో కలిసి వరంగల్‌లో ఉండేది. హైదరాబాద్‌ నుంచి 160 కిలోమీటర్లు (సుమారు 3 గంటల ప్రయాణం). రాత్రి ఒంటి గంటకు స్నేహితుడితో కలిసి వరంగల్‌కు బయల్దేరా' అని తెలిపాడు.

గేటు దూకి, గోడ ఎక్కి:

గేటు దూకి, గోడ ఎక్కి:

'ఒక చేత్తో బిర్యానీ.. మరో చేత్తో సాంబార్‌ అన్నం పట్టుకుని స్నేహితుడు కారులో కూర్చున్నాడు. వరంగల్‌కు చేరుకున్నాం. తీరా అక్కడకి వెళ్లాక ప్రీతి ఇంటి గేటుకు తాళం వేసి ఉంది. ఆమె బయటకు రాలేని పరిస్థితి. ఎలాగైనా ప్రీతిని కలవాలని అనుకున్నా. ఇంట్లోవాళ్లు చూస్తే.. గోడ దూకి పారిపోవాలని ముందే అనుకున్నా. ఎందుకైనా మంచిదని నా స్నేహితుడుని డ్రైవర్‌ సీట్లో కూర్చొనమని కారు స్టార్ట్‌ చేసి ఉంచమని చెప్పా. కారు స్టార్ అయి ఉంది. గేటు దూకి, గోడ ఎక్కి ప్రీతిని కలిశా. అదృష్టవశాత్తు ఎవరూ చూడలేదు' అని విహారి చెప్పాడు.

పెద్దల అంగీకారంతో పెళ్లి:

పెద్దల అంగీకారంతో పెళ్లి:

హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త ఏరువ రాజేంద్ర రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్‌. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రీతిని విహారి తొలిసారిగా కలుసుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయడంతో.. కులాంతర వివాహానికి ప్రీతి తల్లిదండ్రులు మొదట్లో అంగీకరించలేదు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. స్వీడన్‌లో మాస్టర్స్‌ చేసిన ప్రీతి ఫ్యాషన్ డిజైనర్.

2018లో ఆరంగేట్రం:

2018లో ఆరంగేట్రం:

దేశవాళీ రంజీ క్రికెట్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హనుమ విహారి 2018 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంగేట్రం చేశాడు. భారత జట్టు తరఫున 9 టెస్టులు ఆడిన విహారి 552 పరుగులు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో రెండు మ్యాచ్‌లాడి 4 పరుగులతో నిరాశపరిచాడు.

9 టెస్టులు.. 552 పరుగులు:

9 టెస్టులు.. 552 పరుగులు:

9 టెస్టుల కెరీర్‌లో ఒక మ్యాచ్‌ మినహా (వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై) విహారి 8 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. 2018లో ఇంగ్లండ్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఆంధ్రా ఆటగాడు టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ముఖ్యంగా విదేశాల్లో గొప్పగా రాణిస్తాడని ప్రశంసలు అందుకున్నాడు. భారత్‌ తరఫున 9 టెస్టులు ఆడి 36.8 సగటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, April 10, 2020, 15:11 [IST]
Other articles published on Apr 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+