Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇరానీ కప్‌లో చరిత్ర సృష్టించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి

Hanuma Vihari creates Irani Cup history with hat-trick of hundreds

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఇరానీ కప్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి అరుదైన రికార్డుని నెలకొల్పాడు. విదర్భ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌‌లో రెస్టాఫ్ ఇండియా జట్టు తరుపున ఆడుతోన్న హనుమ విహారి.. తొలి ఇన్నింగ్స్‌లో 211 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులు సాయంతో 114 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విహారి సెంచరీ సాధించడంతో రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో సైతం 197 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు.

2017-18లోనూ సెంచరీ సాధించిన విహారి

శుక్రవారం లంచ్ విరామానికి ముందు విదర్భ బౌలర్ అక్షయ్ వఖారీ బౌలింగ్‌లో సింగిల్ తీయడంతో విహారి సెంచరీ సాధించాడు. అంతకముందు 2017-18లోనూ రెస్టాఫ్ ఇండియా తరఫున ఆడిన విహారి 183 పరుగులు చేశాడు. తద్వారా ఇరానీ కప్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా హనుమ విహారి చరిత్ర సృష్టించాడు.

గతేడాది అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం

గతేడాది అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం

గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీ టెస్టు అరంగేట్రం చేసిన హనుమ విహారి తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ ఆశించిన స్థాయిలో రాణింలేకపోయాడు. ఇందుకు కారణం హనుమ విహారని చివరి రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దింపడమే.

విదర్భ జట్టుతో ఇరానీ కప్

విదర్భ జట్టుతో ఇరానీ కప్

అయితే, ఇటీవలే రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన విదర్భ జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ కప్‌లో మళ్లీ ఫామ్ అందుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీ విజేతతో రెస్టాఫ్ ఇండియా జట్టు ప్రతి ఏడాది ఇరానీ కప్‌ పేరిట మ్యాచ్‌ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ వేలంలో రూ. 2 కోట్లు పలికిన హనుమ విహారి

ఐపీఎల్ వేలంలో రూ. 2 కోట్లు పలికిన హనుమ విహారి

గత డిసెంబర్‌లో ఐపీఎల్ 2019 సీజన్‌ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో రూ. 50 లక్షలు కనీస ధరతో వేలంలోకి వచ్చిన హనుమ విహారిని ఏకంగా రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, February 15, 2019, 15:31 [IST]
Other articles published on Feb 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+