Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరిగిన మణికట్టుతో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి.. ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!

 Hanuma Vihari bats with broken wrist fans hail him as gutsiest player

క్రికెట్‌లో అత్యంత ధైర్యవంతులైన బ్యాటర్లలో ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి ఒకడు. అంతకుముందు వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ కూడా భారత జట్టు తరఫున చివరి వరకూ పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసిన సంగతి ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేసి చూపించాడీ ఆంధ్ర టీం కెప్టెన్. మధ్యప్రదేశ్‌తో రంజీ మ్యాచ్ సందర్భంగా ఆవేష్ ఖాన్ వేసిన బంతి అతని మణికట్టును తీవ్రంగా గాయపర్చింది. దీంతో చాలా బాధపడిన అతను మైదానం వీడాడు.

అయితే చివరకు ఆంధ్ర జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో విరిగిన మణికట్టుతోనే మళ్లీ బరిలో దిగాడీ ఆంఢ్ర కెప్టెన్. అయితే మణికట్టు గాయం కారణంగా ఈసారి లెఫ్ట్ హ్యాండర్‌గా ఆడాడు. ఇలా ఆడుతూనే 57 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుతిరిగాడు. అతను ఇంత ధైర్యంగా విరిగిన మణికట్టుతో బరిలో దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

దీనికితోడు అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడాన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే చివరకు ఎస్ జైన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీనిపై పలువురు క్రికెటర్లు, అభిమానులు స్పందించారు.

ధైర్యాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాడంటూ అతన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా విహారిని మెచ్చుకున్నాడు. 'ఒంటి చేత్తో అదీ.. టాప్ హ్యాండ్‌తో లెఫ్ట్ హ్యాండ్ ఆడటం. హనుమ విహారీ.. ధైర్యాన్ని మరో మెట్టు తీసుకెళ్లావ్' అని మెచ్చుకున్నాడు. ఇలా విరిగిన మణికట్టుతో కీలకమైన పరుగులు చేసిన విహారి సూపర్ బ్యాటర్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. విహారీ ఇన్నింగ్స్‌తో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగుల భారీ స్కోరు చేసింది.

Story first published: Wednesday, February 1, 2023, 16:26 [IST]
Other articles published on Feb 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+