హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ మరో పార్టీకి కలిసివెళ్లారు. ఇటీవలే యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల మెహందీ, సంగీత్ ఫంక్షన్‌లో వీరిద్దరూ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన యువీ పెళ్లిలో డ్యాన్స్ చేశారు.

తాజాగా సోమవారం రాత్రి జరిగిన ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకకు వచ్చారు. డైరెక్టర్ కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి బాలీవుడ్ జంటలు, యువ తారలు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నలుగు రంగు దుస్తుల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
మరోవైపు ఈ పార్టీకి షారుఖ్, ఐశ్వర్య అభిషేక్, శ్రీదేవి బోణీకపూర్ దంపతులతో పాటు వారిద్దరి కుమార్తెలు, కరీనా సైఫ్ ఆలీఖాన్, ట్వింకిల్ అక్షయ్ కుమార్, బిపాసాబసు కరణ్, దియా మిర్జా సాహిల్, మాధురీ దీక్షిత్ డాక్టర్ శ్రీరామ్ దంపతులు, శిల్పాశెట్టి, టబు, సోనమ్ కపూర్, ఆలియా, కత్రినా తదితరులు హాజరయ్యారు.