For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ప్రదర్శన మిస్టరీ స్పిన్నర్‌కు మరో గొప్ప ఛాన్స్‌ని తెచ్చిపెట్టింది

By Nageshwara Rao
Hampshire announces the signings of Colin Munro and Mujeeb Ur Rahman for T20 Blast

హైదరాబాద్: న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. జులై నెలలో జరగనున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో అతడు హాంప్‌షైర్ జట్టుకు ఆడనున్నాడు. ఈ మేరకు అతడితో ఆ జట్టు యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ స్థానాన్ని కొలిన్ మున్రోతో భర్తీ చేసినట్లు తెలిపింది.

కొలిన్ మున్రో ప్రస్తుతం టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ తరుపున మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. దీంతో పాటు ఆప్ఘనిస్థాన్ టీనేజి సెన్షేషన్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో కూడా హాంఫ్‌షైర్ ఒప్పందం చేసుకుంది. ఆప్ఘన్‌కు చెందిన ఈ మిస్టరీ స్పిన్నర్ వచ్చే సీజన్‌ మొత్తం అందుబాటులో ఉంటాడని తెలిపింది.

ఈ సందర్భంగా ముజీబ్ ప్రదర్శనపై హాంప్‌షైర్ డైరెక్టర్ గైల్స్ వైట్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత ఆరు నెలలుగా ముజీబ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని కొనియాడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో లీడ్ స్పిన్నర్‌గా ముజీబ్ కొనసాగుతున్నాడని తెలిపాడు. ముజీబ్ మిస్టర్ స్పిన్నర్ కావడంతో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనడం బ్యాట్స్‌మెన్లకు కష్టమని అన్నాడు.

న్యూజిలాండ్ బ్యాట్స్‌‌మెన్ మున్రో టోర్నీ తొలి అర్ధభాగం వరకు అందుబాటులో ఉంటారని తెలిపాడు. 'గత కొన్ని సంవత్సరాలుగా కొలిన్ మున్రో న్యూజిలాండ్ తరుపున చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. అతడితో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది. టీ20 బ్లాస్ట్ టోర్నీలో మున్రో తొలి అర్ధభాగం అంటే జులై నెల మొత్తం అందుబాటులో ఉంటాడు' అని తెలిపాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన ముజీబ్ 14 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ముజీబ్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 27/3.

Story first published: Friday, May 18, 2018, 17:29 [IST]
Other articles published on May 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+