ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్ సెమీ ఫైనల్ రేసులోకి రాకుండానే నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో ఆ జట్టులోని ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగి నిరాశ పరిచిన స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ పై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ కూడా అదే చేశాడు. బాబర్ తనని తాను కింగ్ గా చిత్రీకరించుకునేందుకు పీఆర్ టీమ్ ను నియమించుకున్నాడని ఆరోపణలు చేశాడు.
విరాట్ కోహ్లీ అసలైన, నిజమైన కింగ్ అని ప్రశంసించాడు హఫీజ్. "విరాట్ నిజమైన కింగ్ అని మరోసారి నిరూపించాడు. అతడు అవసరమైన సందర్భాల్లో.. ఎదురు చూసి మరీ పెద్ద ఈవెంట్ లలో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేస్తుంటాడు. ఈ సారి పాకిస్థాన్ పై సెంచరీ బాది హీరోగా నిలిచాడు. అసలు భారత్ - పాక్ మ్యాచ్ ఆడే అవకాశం వస్తే, అదే సమయంలో స్టార్ అవ్వడానికి కూడా ఆటగాళ్లకు అవకాశం వస్తుంది. భారత్ పై షోయబ్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అందుకే అతడు స్టార్ అయ్యాడు. షాహిద్ అఫ్రిది కూడా అంతే. భారత్ పై సిక్స్ లు బాది స్టార్ గా అవతరించాడు. అని పేర్కొన్నాడు.

అందుకే కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్..
కింగ్ అనే టైటిల్ కు కోహ్లీనే సరిగ్గా సరిపోతాడు. అతడే దానికి న్యాయం చేస్తాడు. క్రికెట్ లో అతడు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్. ఎప్పుడు పెద్ద అవకాశాల కోసమే ఎదురుచూస్తాడు. వాటిని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాడు. అతడు తన కోసం కాకుండా, దేశం కోసం, జట్టు కోసం గెలవాలని ఆడతాడు. అందుకే అతడు ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు.

బాబర్ తో పోల్చొద్దు..
బాబర్ ఆజామ్ ను విరాట్ కోహ్లీతో ఎప్పుడూ పోల్చొద్దని అన్నాడు హఫీజ్. "బాబర్ పీఆర్ ఎజెన్సీలను నియమించుకుని తనని తాను కింగ్ అంటూ ప్రమోట్ చేసుకుంటుంటాడు. నిజంగా కింగ్ అనే టైటిల్ ఎవరికైనా ఇవ్వాలంటే, అది కోహ్లీకి మాత్రమే. అతడే దానికి అర్హుడు. బాబర్ ను కింగ్ అని పిలవకూడదు. విరాట్ ప్రదర్శన పరిశీలిస్తే, అతడు ప్రపంచంలో ఎక్కడైనా అద్భుతంగా రాణించగలడు. అతడు కింగ్ అవ్వడానికి ఏ పీఆర్ టీమ్ లను పెట్టుకోలేదు." అని పేర్కొన్నాడు.
Players work on their ball-striking ability in the ongoing Pakistan Strike Force camp in Faisalabad. pic.twitter.com/pvEc72n73J
— Pakistan Cricket (@TheRealPCB) February 24, 2025