For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్ వదిలేసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయి: వసీం అక్రమ్ సూచన

By Nageshwara Rao
Hafeez should give up bowling after third suspension – Akram

హైదరాబాద్: వివాదాస్పద బౌలింగ్‌ శైలి కారణంగా నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్‌ హఫీజ్‌ బౌలింగ్‌పై కాకుండా బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని ఆ దేశ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ సూచించాడు. హఫీజ్‌ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఐసీసీ అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. హఫీజ్‌ బంతులను విసిరేటప్పుడు తన మోచేతిని నిర్ణీత 15 డిగ్రీల కన్నా మించి వంచుతున్నాడని తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెలలో అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్ అంఫైర్లు ఐసీసీకి నివేదిక అందించారు.

దీంతో నవంబర్ 1న ఇంగ్లాండ్‌లోని లౌబోరో యూనివర్సిటీలో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించారు. ఈ పరీక్షల్లో అతడు బౌలింగ్ వేసే సమయంలో 15 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో మోచేతిని వంచుతున్నట్లు తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలా బౌలింగ్ చేయడం విరుద్ధం. మూడేళ్ల వ్యవధిలో హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడం ఇది మూడోసారి.

తొలిసారి 2014లో కివీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి హఫీజ్‌ని ఐసీసీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఏడాది ఏప్రిల్‌లో అతడు బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది నెలలకే శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో మళ్లీ తెరపైకి వచ్చాడు. దీంతో ఐసీసీ అతడు ఏడాదిపాటు సస్పెండ్ చేసింది.

తాజాగా దీనిపై ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం అక్రమ్‌ మాట్లాడుతూ 'హఫీజ్‌ బౌలింగ్‌ కంటే బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం మంచిది. ఇది అతని భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. అతనికి క్రికెట్లో మంచి అనుభవం ఉంది. కాబట్టి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టి అందులో రాణిస్తే అది జట్టుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది' అని అన్నాడు.

ఇదిలా ఉంటే ఐసీసీ తన బౌలింగ్ యాక్షన్‌పై నిషేధం విధించడంతో బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు హఫీజ్‌ ప్రకటించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, November 19, 2017, 11:10 [IST]
Other articles published on Nov 19, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+