Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హఫీజ్.. హసన్‌ల బాదుడుతో విజయం సాధించిన పాక్

Hafeez, Hasan star in thrilling Pakistan win

హైదరాబాద్: ఆస్ట్రేలియాను వైట్‌వాష్‌ చేసి జోరు మీదున్న పాకిస్తాన్‌ మరోసారి అద్భుతం చేసింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. హఫీజ్‌, హసన్‌ పోరాట పటిమతో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒత్తిడికిలోనై గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది కివీస్‌.

10 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు

10 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు

149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కో​ల్పోయి 146 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. ఆసిఫ్‌ అలీ(24), మహ్మద్‌ హఫీజ్‌(45), సర్ఫరాజ్‌ అహ్మద్‌(34) సమయోచిత బ్యాటింగ్‌తో పాక్‌ కోలుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

కివీస్‌ చివరి ఓవర్‌లో 17 పరుగులు

కివీస్‌ చివరి ఓవర్‌లో 17 పరుగులు

చేధనలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించింది. 79/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్‌.. పాక్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మున్రో (58), టేలర్‌ (42) రాణించినా మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో కివీస్‌ ఓటమి పాలైంది. పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ విజయం సాధించాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాలి.

టేలర్‌‌పై భరోసాతో ప్రేక్షకులంతా ఉత్కంఠగా

టేలర్‌‌పై భరోసాతో ప్రేక్షకులంతా ఉత్కంఠగా

ఈ దశలో 18 ఏళ్ల షహీన్‌ ఆఫ్రిదికి హఫీజ్‌ బంతి ఇచ్చాడు. మొదటి బంతికి సింగిల్‌ మాత్రమే ఇచ్చాడు. రెండో బంతిని సౌతీ బౌండరికీ పంపాడు. తర్వాతి బంతికి సింగిల్‌.. నాలుగు, ఐదో బాల్స్‌కు రెండేసి పరుగులు వచ్చాయి. చివరి బంతికి సిక్సర్‌ కొడితే మ్యాచ్‌ టై అవుతుంది. అందరిలోనూ ఒక్కటే టెన్షన్‌. ఏదైనా అద్బుతం జరిగితే తప్పా కివీస్‌ గెలిచే ఛాన్స్‌ లేదు. కానీ బ్యాటింగ్‌ చేస్తుంది సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ కావడంతో ప్రేక్షకులంతా ఉత్కంఠగా వీక్షించారు.

3 మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ 1-0 ఆధిక్యం

3 మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ 1-0 ఆధిక్యం

అయితే చివరి బాల్‌కు ఫోర్‌ రావడంతో పాకిస్తాన్‌ ఊపిరి పీల్చుకుంది. రెండు పరుగుల తేడాతో సత్తా చాటింది. తనపై కెప్టెన్‌ ఉంచిన నమ్మకాన్ని షహీన్‌ వమ్ముచేయకుండా మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హఫీజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌' అందుకున్నాడు.

Story first published: Thursday, November 1, 2018, 9:58 [IST]
Other articles published on Nov 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+