డివిలియర్స్‌తో కోహ్లీ సెల్ఫీ: జట్టుతో కలిసి జీపులో ప్రయాణం (వీడియో)
హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో తిరిగి ఉత్సాహం నింపేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల అనంతరం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
దీంతో శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కి ఫిటెనెస్ సాధించేందుకు విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతనితో పాటు వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన డివిలియర్స్ కూడా గురువారం ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లలో కనీసం ఒకరైనా.. ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో గాయపడిన కోహ్లీ బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతనితో పాటు డివిలియర్స్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌లు టోర్నీకే పూర్తిగా దూరమయ్యారు.
అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌తో ప్రాక్టీస్ సెషన్ జరుగుతోంది
‘ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్‌తో ప్రాక్టీస్ సెషన్ చాలా బాగా జరుగుతోంది. ఫిటెనెస్ కోసం ఇద్దరం శ్రమిస్తున్నాం.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టి ఆటతో అందర్నీ అలరిస్తాం. ఒకే తల్లి బిడ్డలం కాకపోయినా.. మేము అన్నదమ్ములం' అంటూ విరాట్ కోహ్లి ఉద్వేగంగా తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చాడు. గత ఏడాది ఐపీఎల్‌లో కోహ్లీ-డివిలియర్స్ అత్యుత్తమ భాగస్వామ్యాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ఫొటో షూట్లు, ప్రకటనలలో బిజీగానే గడుపుతున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి మైదానంలో అయితే దిగకపోయినా జట్టు జెర్సీ వేసుకుని బిజీగానే గడిపేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భుజానికి గాయం కావడంతో అప్పటినుంచి క్రికెట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నా, జట్టుతో కలిసి ఫొటో షూట్లు, ప్రకటనలలో బిజీగానే ఉంటున్నాడు. తాజాగా తన ట్విట్టర్ పేజీలో కోహ్లీ ఒక వీడియో షేర్ చేశాడు. అందులో తన జట్టు సభ్యులను కొంతమందిని ఒక వింటేజ్ జీపులో ఎక్కించుకుని అలా కొంతదూరం తిప్పడం కనిపిస్తుంది. ఫ్రంట్ సీట్లో కోహ్లీ పక్కనే క్రిస్ గేల్ కూర్చోగా.. వెనకాల ఎస్ అరవింద్, షేన్ వాట్సన్, ఏబీ డివీలియర్స్ ముగ్గురూ ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఓపెన్ టాప్ జీపును స్వయంగా కెప్టెన్ కోహ్లీయే డ్రైవ్ చేయడం గమనార్హం.

బెంగళూరు కెప్టెన్‌గా షేన్ వాట్సన్
రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో ధర్మశాలలో జరిగిన చివరి టెస్టుకు కోహ్లీ దూరం కాగా, రహానే కెప్టెన్‌గా వ్యవహరించి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీతో పాటు మరో స్టార్ ప్లేయర్ ఏబీ డివీలియర్స్ కూడా దూరం కావడంతో షేన్ వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

తోలి మ్యాచ్‌లో ఓటమి
బెంగళూరు జట్టులో కోహ్లీ, డివిలియర్స్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడటం లేదు. ఇక కేఎల్ రాహుల్ మొత్తం టోర్నమెంటుకే దూరమయ్యాడు. గాయాలపాలైన వీళ్లంతా అసలు ఈ సీజన్‌లో ఆడతారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో కోహ్లీ, డివీలియర్స్ ఇద్దరూ లేకపోవడంతో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 35 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications