
కుల్దీప్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్‌ను ఎంచుకోవడం ఉత్తమం
'కుల్దీప్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. దీని వల్ల స్ట్రైకింగ్ నుంచి తప్పుకోవచ్చు లేదా, ఖాళీల నుంచి బౌండరీ సాధించవచ్చు. అయితే నేను అవుటైన బంతికి మాత్రం నా మైండ్ బ్లాంక్ అయింది' అని మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఫించ్ చెప్పుకొచ్చాడు.

42 పరుగుల వద్ద అవుటైన ఆరోన్ ఫించ్
తొలి టీ20లో కుల్దీప్ బౌలింగ్‌లో మొత్తం ఐదు స్వీప్‌షాట్‌లు ఆడగా, డిఫెన్స్ ఆడిన బంతికి 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫించ్ అవుటయ్యాడు. దీనిపై ఫించ్ మాట్లాడుతూ కుల్దీప్ బౌలింగ్‌లో సుడులు తిరుగుతూ వచ్చే బంతులను స్వీప్ చేయడం ఉత్తమమని అన్నాడు. అలానే ట్రాక్‌పై బౌన్స్‌ను అంచనా వేయడం చాలా కష్టమని కూడా చెప్పాడు.

135 అద్భుతమైన స్కోరు
తొలి మ్యాచ్‌లో భారత్ ఒకవేళ 20 ఓవర్లూ ఆడాల్సి వచ్చి ఉంటే 135 అద్భుతమైన స్కోరని అన్నాడు. మా బౌలర్లు చివరి బంతి వరకూ పోరాడారని, ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లపై జాసన్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని ఫించ్ పేర్కొన్నాడు. వరుణుడు అంతరాయ కలిగించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 18.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

9 వికెట్ల తేడాతో భారత్ విజయం
ఆనంతరం డక్‌వర్త్ లూయీస్ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగులు నిర్ధేశించగా కోహ్లీసేన 5.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 11 పరుగులు చేసి అవుటవగా శిఖర్ ధావన్ 15, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు.


Click it and Unblock the Notifications