Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత పర్యటనను దెబ్బతీసే కుట్ర: బీసీబీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

 Had information that this was a conspiracy to sabotage India tour: BCB chief on players strike

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ల డిమాండ్లను అంగీకరించడం పొరపాటు అని తాను భావిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపాడు. నవంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనకు ముందు బంగ్లాదేశ్ ఆటగాళ్లు సమ్మెకు దిగారు.

మొత్తం 11 డిమాండ్లతో షకీబ్ ఉల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ క్రికెటర్లు బోర్డుకు వ్యతిరేకంగా సమ్మెను ప్రకటించారు. అయితే, తర్వలో భారత పర్యటన ఉండటంతో చేసేది లేక ఆటగాళ్ల డిమాండ్లను నెరవేరువేర్చేందుకు బోర్డు ముందుకొచ్చింది. బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించారు.

భారత పర్యటనను దెబ్బతీసే కుట్ర

భారత పర్యటనను దెబ్బతీసే కుట్ర

అయితే, ఈ సమ్మె వెనుక భారత పర్యటనను దెబ్బతీసే కుట్ర దాగి ఉందని తమకు సమాచారం వచ్చిందని బెంగాలీ డైలీకి ఇచ్చిన ఇంటర్యూలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "భారత పర్యటన గురించి మీరు (మీడియా) ఇంకా ఏమీ చూడలేదు" అని అన్నారు.

మీరు నన్ను నమ్మాలి

మీరు నన్ను నమ్మాలి

"వేచి చూడండి. ఇది భారత పర్యటనను దెబ్బతీసే కుట్ర అని నాకు నిర్దిష్ట సమాచారం ఉంది. మీరు నన్ను నమ్మాలి" అని అన్నారు. ఎందుకు అలా అనుకున్నాడో వివరంగా చెప్పమని రిపోర్టర్లు అడిగినప్పుడు, తమీమ్ ఇక్బాల్ తన భార్య డెలివరీని కారణంగా పేర్కొని పర్యటన నుండి వైదొలిగిన తీరుపై తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

తమీమ్ ఇక్బాల్ ఇలా

తమీమ్ ఇక్బాల్ ఇలా

"తన రెండవ బిడ్డ పుట్టినందుకు రెండో టెస్ట్ (నవంబర్ 22-26 వరకు - కోల్‌కతా)కు మాత్రమే దూరమవుతానని తొలుత నాకు చెప్పాడు. అయితే, ఆటగాళ్లతో సమావేశమైన తర్వాత, తమీమ్ నా గదికి వచ్చి, అతను మొత్తం పర్యటన నుండి వైదొలగాలని కోరుకున్నట్లు చెప్పాడు. నేను అతడిని 'ఎందుకు అలా?' అని ప్రశ్నించినప్పుడు తమీమ్ వెళ్ళనని చెప్పాడు" అని అన్నారు.

చాలా మంది తప్పుకున్నా ఆశ్చర్యపోను

చాలా మంది తప్పుకున్నా ఆశ్చర్యపోను

"పదకొండవ గంటలో వేరొకరు సిరిస్ నుంచి తప్పుకుంటామని చెప్పినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే ఇప్పటికే సిరిస్‌కు జట్టుని ఎంపిక చేశాం కాబట్టి. నేను చాట్ చేయమని షకీబ్‌ను పిలిచాను. ఇప్పుడు అతను కూడా సిరిస్‌ నుంచి తప్పుకుంటే నేను కెప్టెన్‌ను ఎక్కడ నుంచి తీసుకురావాలి? నేను జట్టు మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. ఈ ఆటగాళ్లతో నేను ఏమి చేయాలి" అని అన్నారు.

ప్రతిరోజూ వారితో మాట్లాడుతున్నా

ప్రతిరోజూ వారితో మాట్లాడుతున్నా

"నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను ప్రతిరోజూ వారితో మాట్లాడుతున్నాను. ఆటగాళ్లు సమ్మె ప్రకటించే ముందు కనీసన్న నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. వారి డిమాండ్లకు అంగీకరించడం నా తప్పు అని నేను భావిస్తున్నాను. నేను ఎప్పుడూ అలా చేయకూడదు" అని బీసీబీ ఛీఫ్ నజ్ముల్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఆటగాళ్లతో చెప్పాను

నేను ఆటగాళ్లతో చెప్పాను

"నేను ఆటగాళ్లతో చెప్పాను 'మీరు సమ్మెను విరమించుకుంటే తప్ప, మేము మీతో చర్చల్లో పాలుపంచుకోబోమని. మిగతా సభ్యుల బోర్డులతో మాట్లాడుతూ నిజానికి ఇది మా విధానం కాదని నేను భావించాను. కానీ మీడియా కూడా మాపై ఒత్తిడి తెచ్చింది" అని నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. భారత పర్యటన కోసం బంగ్లాదేశ్ జట్టు బుధవారం ఢిల్లీకి రానుంది.

నవంబరు 3న ఢిల్లీలో తొలి టీ20

నవంబరు 3న ఢిల్లీలో తొలి టీ20

సిరిస్‌లో భాగంగా నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:

1st T20I - New Delhi (November 3) - 7:00 PM (IST)

2nd T20I - Rajkot (November 7) - 7:00 PM (IST)

3rd T20I - Nagpur (November 10) - 7:00 PM (IST)

1st Test - Indore (November 14-18) - 9:30 AM (IST)

2nd Test - Kolkata (November 22-26) - 9:30 AM (IST)

TV Channels: Star Sports Network

Live Streaming: HotStar.com

బంగ్లా టీ20 జట్టు:

బంగ్లా టీ20 జట్టు:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్.

Story first published: Monday, October 28, 2019, 16:06 [IST]
Other articles published on Oct 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+