Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరుగుల సునామీ వీరేంద్ర సెహ్వాగ్‌పై సచిన్ ఇలా

బెంగుళూరు: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన పలు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను చూసే అవకాశం కలిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

అక్టోబర్ 20న వీరేంద్ర సెహ్వాగ్ తన 37వ పుట్టిన రోజునే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తోపాటు అంతర్జాతీయ అన్ని ఫార్మాట్లకు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది' అని సెహ్వాగ్ మంగళవారం తన ట్విటర్‌లో ట్వీట్ చేశాడు.

దీంతో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీలు సైతం సోషల్ మీడియాలో వీరేంద్ర సెహ్వాగ్‌కు ఘనమైన నివాళులర్పిస్తున్నారు. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ఖాతాలో ఘనమైన విజయాలు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్ ఆటలో తన సంతకాన్ని చూపించాడు. బ్యాటింగ్‌తో పాటు జీవితంలో అతని స్వభావసిద్ధమైన విధానాన్ని ప్రేమిస్తున్నానని ట్వీట్ చేశారు.

Had 'best seat' to watch Virender Sehwag's superlative performances: Sachin Tendulkar

'క్రికెట్ మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన పలు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను చూసే అవకాశం కలిగింది. రాబోయే రోజుల్లో మా ముఖాల్లో సంతోషాన్ని, చిరునవ్వుని తీసుకురాగలడ' ని భావిస్తన్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ జోడీ అద్భుతమైన రికార్డులను సాధించారు.

ఐసీసీ వరల్డ్ కప్ 2011లో ఈ జోడీ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన ఓపెనర్లుగా ఉన్నారు. అంతేకాదు సెహ్వాగ్ జీవితంలో పొందిన అత్యుత్తమ కాంప్లిమెంట్ ఏమిటంటే సచిన్ లాగే బ్యాటింగ్ స్టయిల్ ఉండటం. 14 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన వీరేంద్ర సెహ్వాగ్ తన 37వ పుట్టిన రోజునే అంతర్జాతీయ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికాడు.

వీరేంద్ర సెహ్వాగ్ సృష్టించిన పరుగుల సునామీ ఇదీ:

* ప్రపంచ వ్యాప్తంగా టెస్టుల్లో, వన్డేల్లో ఓపెనర్‌గా 7,500కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.
* టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచరీ (278 బంతులు) చేసిన ఆటగాడు.
* టెస్టుల్లో వేగంగా సెకండ్, థర్డ్ డబుల్ సెంచరీలు. అలాగే టెస్టుల్లో 10 వేగవంతమైన డబుల్ సెంచరీల్లో 5 సెహ్వాగ్‌వే.
* టెస్ట్ ఇన్నింగ్స్‌లో 47 ఫోర్లు బాది సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 52 ఫోర్లతో జాన్ ఎడ్రిచ్ తొలి స్థానంలో ఉన్నాడు.
* వరుసగా 11 సెంచరీలను సెహ్వాగ్ 150+ స్కోరుగా మలిచాడు.
* టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు, ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ సెహ్వాగ్.
* టెస్టుల్లో 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 8 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+